కీసర ORR పై ఘోర రోడ్డు ప్రమాదం.. రెండు బొలెరోలను ఢీకొని..!

by Sumithra |
orr-accident
X

దిశ, కీసర : కీసర పోలీస్ స్టేషన్ పరిధిలోని ఓఆర్‌ఆర్ పై ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. మహేంద్ర మ్యాక్సీ ట్రక్ టైర్ పంక్చర్ కావడంతో డ్రైవర్ రాములు సాయం కోసం మరో మరో ట్రక్‌ను ఆపాడు. దీంతో బొలెరో వాహనం డ్రైవర్ కీసర ఏక్సిట్ నంబర్ 8 వద్ద దిగేందుకు ప్రయత్నిస్తుండగా.. నెల్లూరు నుండి కొంపల్లికి వస్తున్న బొగ్గు లారీ TS05 OE 5059 డ్రైవర్‌ వాహనాన్ని అతివేగంగా నడిపాడు.

ఆగి ఉన్న రెండు బొలెరో వాహనాలను ఢీ కొట్టడంతో ఓఆర్‌ఆర్‌పై నుండి బొగ్గు లారీ బోల్తా కొట్టింది. ఈ ప్రమాదంలో మొదట ఆగిన బొలెరో వాహనం TS08 UB 6876 డ్రైవర్ రాములు మృతి చెందగా.. మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలికి చేరుకుని విచారణ జరుపుతున్నారు. కాగా, దీనికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Advertisement

Next Story