- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
జూన్‌లోనూ అత్యధికంగా నిరుద్యోగ రేటు నమోదు!
దిశ, వెబ్‌డెస్క్: కరోనా నియంత్రణ కోసం లాక్‌డౌన్ తీసేసి అన్‌లాక్ దశకు మారినప్పటికీ దేశంలో నిరుద్యోగ రేటు ఇంకా ఎక్కువగానే ఉందని సెంటర్ ఫర్ మానిటరింగ్ ఇండియన్ ఎకానమీ(సీఎంఐఈ) తెలిపింది. లాక్‌డౌన్‌కు ముందు నిరుద్యోగ రేటు 8 శాతం కంటే తక్కువగానే ఉండేదని, మే నెలలో ఇది 23.5 శాతంగా ఉందని సీఎంఐఈ పేర్కొంది. అయితే, జూన్ నెలలో నిరుద్యోగ రేటు 11 శాతానికి తగ్గినప్పటికీ లాక్‌డౌన్‌కు ముందున్న దాంతో పోలిస్తే అధికమేనని సీఎంఐఈ సీఈవో మహేష్ వివరించారు. 2017-18 ఆర్థిక సంవత్సరంలో నిరుద్యోగ రేటు 4.6 శాతం ఉండగా, ఆ తర్వాతి పరిణామాల్లో క్రమంగా పెరుగుతూ వస్తోంది. 2018-19లో ఇది 6.3 శాతం ఉంటే, 2019-20లో 7.6 శాతానికి పెరిగింది. ఈ గణాంకాలను పరిశీలిస్తే జూన్‌లో నమోదైన 11 శాతం అత్యధికంగా పరిగణించాలని మహేష్ తెలిపారు. జూన్ నెల నుంచి లాక్‌డౌన్ ఆంక్షలు సడలించడం, కార్మిక భాగస్వామ్య రేటు పెరగడంతో 11 శాతానికి చేరిందని మహేష్ తెలిపారు. అనేక రంగాలు పునఃప్రారంభమై కొత్త నియామకాలు చేపట్టనుండటంతో జులైలో మరిన్ని ఉద్యోగాలు పెరుగుతాయని, నిరుద్యోగ రేటు మరింత తగ్గే అవకాశముందని సీఎంఐఈ అంచనా వేసింది.