ఉగ్రదాడి దోషులను విడిచిపెట్టే ప్రసక్తి లేదు.. కిషన్ రెడ్డి హాట్ కామెంట్స్

by Shiva |
ఉగ్రదాడి దోషులను విడిచిపెట్టే ప్రసక్తి లేదు.. కిషన్ రెడ్డి హాట్ కామెంట్స్
X

దిశ, వెబ్‌డెస్క్: పహెల్గాం (Pahelgam)లో టూరిస్టులపై విచక్షణారహితంగా కాల్పులకు చేసిన దోషులను ఎట్టి పరిస్థితుల్లో విడిచిపెట్టే ప్రసక్తే లేదని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి (Kishan Reddy) అన్నారు. ఇవాళ పెహల్గాం ఉగ్రదాడి నేపథ్యంలో ఇవాళ హైదరాబాద్‌ (Hyderabad)లోని ట్యాంక్‌బండ్ (Tankband) వద్ద బీజేపీ నేతలు నిరసనకు దిగారు. ఈ కార్యక్రమంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, ఎంపీలు లక్ష్మణ్, కొండా విశ్వేశ్వర్‌రెడ్డి, ఈటల రాజేందర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా భారత్‌పై ఉగ్రవాదులను దాడికి ఉసిగొల్పిన పాకిస్థాన్ (Pakistan) వ్యతిరేకంగా వారు నినాదాలు చేశారు. అనంతరం కిషన్ రెడ్డి (Kishan Reddy) మాట్లాడుతూ.. ఒక వర్గం వారిని టార్గెట్ చేసి జరిగిన దాడిని ప్రపంచం అంతా ఖండిస్తోందని అన్నారు. పాకిస్థాన్‌లో అసమర్థ నాయకత్వం ఉందని ఫైర్ అయ్యారు. అంతర్గత వ్యవహారాన్ని సరిదిద్దుకోలేని స్థితిలో పాక్ ఉందని ధ్వజమెత్తారు. ఆర్థిక ఇబ్బందుల్లో ఆ దేశం కొట్టుమిట్టాడుతోన్న భారత్‌ (India)పై కయ్యానికి కాలు దువ్వుతోందని ఆక్షేపించారు. ఇలాంటి దాడులతో భారత్‌ను భయపెట్టలేరని అన్నారు. బాధిత కుటుంబాలను ఆదుకుంటామని.. దోషులపై కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. అదేవిధంగా పహెల్గాం దాడి నేపథ్యంలో సాయంత్రం తెలంగాణ వ్యాప్తంగా బీజేపీ శ్రేణులు నిరసన చేపట్టాలని కిషన్ రెడ్డి పిలుపునిచ్చారు.



Next Story

Most Viewed