- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
Goa News : గ్యాంగ్ రేప్ సంచలనం.. అర్థరాత్రి బీచ్‌లో బాలికలకు ఏం పని..?
దిశ, వెబ్‌డెస్క్ : గోవా సముద్రతీరంలో నిన్న అర్థరాత్రి ఇద్దరు బాలికలపై గ్యాంగ్ రేప్ జరిగిన విషయం తెలిసిందే. నలుగురు వ్యక్తులు వారిపై అత్యాచారానికి పాల్పడగా ఈ విషయం ఆ రాష్ట్రంలో సంచలనం సృష్టించింది. అయితే, ఈ ఘటనపై గోవా ముఖ్యమంత్రి ప్రమోద్ సావంత్ స్పందించగా.. అది కాస్తా వివాదాస్పదం అయ్యాయి. ‘‘టీనేజర్లు రాత్రులు బీచుల్లో గడపకూడదని, అసలు వారికి అక్కడ ఏం పని’’ అని ప్రశ్నించారు. ‘‘తమ పిల్లలు అర్ధరాత్రి సముద్రతీరానికి ఎందుకు వెళ్లారో తల్లిదండ్రులు ఆత్మపరిశీలన చేసుకోవాలన్నారు.
అంతేకాకుండా బాలికలు తల్లిదండ్రుల మాట వినకపోతే మాదా బాధ్యత అని’’ ప్రశ్నించారు. ప్రతీ విషయానికి ప్రభుత్వాన్ని, పోలీసులను తప్పుబట్టడం సరికాదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇదిలాఉండగా ముఖ్యమంత్రి వ్యాఖ్యలను ప్రతిపక్షాలు తీవ్రంగా తప్పుబట్టాయి. సీఎం వెంటనే క్షమాపణాలు చెప్పాలంటూ వారు డిమాండ్ చేశారు. ఇదిలాఉండగా, బాలికలపై గ్యాంగ్ రేప్ జరగడం కంటే ముందు 10 మంది పార్టీ కోసం బీచ్‌కు వెళ్లగా.. నలుగురు మాత్రం రాత్రంతా అక్కడే గడిపినట్లు సమాచారం. అందులో ఇద్దరు అబ్బాయిలు మరియు ఇద్దరు బాలికలు అని తెలుస్తోంది.