- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
సీఎం కేసీఆర్ కాళ్లపై మోకరిల్లిన సిద్దిపేట కలెక్టర్
దిశ ప్రతినిధి, మెదక్ : ఐఏఎస్ స్థాయిలో ఉన్న అధికారి సీఎం కాళ్లు మొక్కడంపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. సీఎం సిద్దిపేట పర్యటనలో భాగంగా ఆదివారం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం, పోలీస్ కమిషనరేట్ ప్రారంభించిన అనంతరం జిల్లా సమీకృత కలెక్టరేట్ కార్యాలయాన్ని సీఎం ప్రారంభించారు. అనంతరం కలెక్టర్ ఛాంబర్‌లోకి వచ్చిన సీఎం.. కలెక్టర్ కుర్చీలో జిల్లా కలెక్టర్ వెంకట్రామిరెడ్డిని కూర్చో బెట్టారు. తన కుర్చీలో ఆసీనులైన కలెక్టర్ వెంటనే సీఎం కాళ్లపై పడి ఆశీర్వాదం తీసుకున్నారు. తన కుటుంబ సభ్యులను సీఎంకి పరిచయం చేశారు.
కలెక్టర్ అయి ఉండి సీఎం కాళ్లు మొక్కడంపై పలువురు ఐఏఎస్ అధికారులు, పలువురు ప్రతిపక్ష నాయకులు విమర్శిస్తున్నారు. గతంలోనూ నూతన జిల్లా ఏర్పాటు సమయంలోను సీఎం కాళ్లు మొక్కి విమర్శల పాలైనా మళ్లీ కాళ్లు మొక్కడం గమనార్హం. కాగా కొందరు అధికారులు సిద్దిపేట జిల్లా కలెక్టర్… ఓ అధికారియా… లేక రాజకీయ నాయకుడా.. అని ప్రశ్నిస్తున్నారు. ఇదే కలెక్టర్ గతంలో సీఎం కేసీఆర్ గజ్వేల్ ఎమ్మెల్యే అని సంభోదించారు.
దుబ్బాక ఉప ఎన్నిక సమయంలోనూ దుబ్బాక టికెట్ జిల్లా కలెక్టర్‌కు కేటాయిస్తారని ప్రచారం జరిగింది. ఆ సమయంలో ఆయన ఆ వార్తను ఖండించలేదు. కాగా ప్రస్తుతం కలెక్టర్ కార్యాలయ ఓపెనింగ్‌లో రాజకీయ నాయకునిలా సీఎం కాళ్లపై పడటంతో జిల్లా కలెక్టర్ రాజకీయాల్లోకి రావాలనుకొంటున్నాడా అంటూ విమర్శల వర్షం కురిపిస్తున్నారు. దీనిపై కలెక్టరే సమాధానం చెప్పాలి.