- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
వ్యాక్సిన్ అందించేందుకు రెడీగా ఉన్నాం: కేసీఆర్
దిశ, తెలంగాణ బ్యూరో: శాస్త్రీయంగా ఆమోదింపబడిన వ్యాక్సిన్‌ను ప్రజలకు అందించేందుకు ప్రభుత్వం రెడీగా ఉందని సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు. ఇదేక్రమంలో వ్యాక్సిన్‌తో ఏమైనా సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయా అనే విషయాన్ని సైతం నిర్ధారించుకోవాల్సిన అవసరం ఉందన్నారు. ప్రధాని మోడీ మంగళవారం అన్నిరాష్ట్రాల సీఎంలు, లెఫ్టినెంట్ గవర్నర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి, వ్యాక్సిన్ వచ్చిన తర్వాత ప్రజలకు అందించే విధానంపై చర్చించారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ తన అభిప్రాయాలను వెల్లడించారు. వ్యాక్సిన్ కోసం ప్రజలంతా ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. శాస్త్రీయంగా ఆమోదించబడిన వ్యాక్సిన్ రావాల్సిన అవసరం ఉంది. వ్యాక్సిన్‌ను ప్రాధాన్యతా క్రమంలో ప్రజలకు అందించడానికి తెలంగాణ ప్రభుత్వం సిద్ధంగా ఉంది. దీనికి అనుగుణమైన కార్యాచరణను రూపొందించాం. ఈ వ్యాక్సిన్ వల్ల ఏమైనా సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయా అనే విషయాలను పరిగణలోకి తీసుకోవాల్సి ఉంది. దేశంలో వివిధ ప్రాంతాల్లో వేర్వేరు వాతావరణ పరిస్థితులు ఉన్నాయి. కరోనా వైరస్ దేశమంతా ఒకే రకమైన ప్రభావం చూపలేదు. వ్యాక్సిన్ కూడా ఒక్కో ప్రాంతంలో ఒక్కో రకమైన సైడ్ ఎఫెక్ట్స్ ఇచ్చే అవకాశం ఉంది. మొదట రాష్ట్రానికి కొన్ని చొప్పున వ్యాక్సిన్ డోసులు పంపి వాటిని కొంతమందికి ఇవ్వాలి. పది, పదిహేను రోజులు పరిస్థితిని పరిశీలించి తర్వాత మిగతా వారికి ఇవ్వాలి” అని సీఎం కేసీఆర్ చెప్పారు.