గ్రామాల్లోనే కొంటామన్న కేసీఆర్

by Shyam |   ( Updated:2020-10-23 06:06:17.0  )
గ్రామాల్లోనే కొంటామన్న కేసీఆర్
X

దిశ, వెబ్‌డెస్క్: రైతులు పండించిన వరి ధాన్యాన్ని గ్రామాల్లోనే కొనుగోలు చేయాలని సీఎం కేసీఆర్ నిర్ణయించారు. శుక్రవారం ప్రగతి భవన్‌లో వానకాలం పంటల కొనుగోలు పై సమీక్షించిన సీఎం ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గ్రామాల్లోనే మద్ధతు ధర ఇచ్చి మక్కలను కొనుగోలు చేస్తామన్నారు. క్వింటల్‌కు రూ. 1,850 మద్ధతు ధర చెల్లించి.. మార్క్ ఫెడ్ ద్వారా కొనుగోలు చేస్తామని కేసీఆర్ స్పష్టం చేశారు. రైతులు నష్ట పోవద్దనే ఈ నిర్ణయం తీసుకుంటున్నట్టు ఆయన వెల్లడించారు.

Advertisement

Next Story