- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
నిఘా వర్గాలను రంగంలోకి దింపిన కేసీఆర్
దిశ ప్రతినిధి, కరీంనగర్: గ్రేటర్ ఎన్నికలపై పోస్టుమార్టం ప్రారంభించిన టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ తెలంగాణ వ్యాప్తంగా నిఘా కళ్లకు పని చెప్పారు. క్షేత్ర స్థాయిలోకి వెళ్లండి.. అన్ని పార్టీలకు సంబంధించిన నాయకుల గురించి వాకబు చేయండి.. ప్రతి విషయాన్ని పరిగణనలోకి తీసుకుని పూర్తి స్థాయి నివేదికలు ఇవ్వండంటూ ఇంటెలిజెన్స్ వర్గాలకు ఆదేశాలు జారీ చేశారు.
ఫీల్డ్ రిపోర్ట్ కంపల్సరీ…
రాష్ట్ర వ్యాప్తంగా టీఆర్ఎస్, కాంగ్రెస్, టీడీపీలకు చెందిన నాయకుల గురించి వివరాలు సేకరించి రిపోర్టులు పంపించేదుకు కంపల్సరీ ఫీల్డ్ ఇన్‌స్పెక్షన్ చేయాల్సిందేనని ఉన్నతాధికారులకు ఆదేశాలు జారీ చేశారు. దీంతో నిఘా వర్గాల బృందం ఓటర్లను ప్రభావితం చేయగలిగే ప్రతి లీడర్ గురించి రిపోర్ట్ అందించే పనిలో నిమగ్నం అయ్యారు. గ్రేటర్‌లో ఊహించని స్థాయిలో బీజేపీ పుంజుకోవడంతో రానున్న కాలంలో దీని ప్రభావం పార్టీపై ఎంత మేర పడనుంది, దానిని ఎలా అధిగమించాలి అన్న విషయాలపై అధినేత కేసీఆర్ రంగంలోకి దిగారని తెలుస్తోంది.
టీఆర్ఎస్ పార్టీకి చెందిన కేడర్‌లో బీజేపీ వైపు మొగ్గు చూపుతున్న వారెవరు..? ఎందుకు అటువైపు ఆకర్షితులు అవుతున్నారు.? సొంత పార్టీలో వారికి గుర్తింపు లేకుండా పోయిందా, స్థానికంగా ఉన్న అంతర్గత విబేధాలా లేక ఇతరాత్ర కారణాలేమైనా ఉన్నాయా.. అన్న ప్రతి విషయాన్ని క్షుణ్ణంగా పరిశీలించి రిపోర్టులు అందజేయాలని ఇంటెలిజెన్స్ వర్గాలకు స్పష్టం చేశారు. ఇతర పార్టీకి చెందిన వారైతే బీజేపీ వైపు ఎందుకు చూస్తున్నారు? వారికి అక్కడ ఉన్న కంఫర్టబులిటీ ఏంటీ.? వారి వల్ల బీజేపీకి జరగనున్న లాభం ఏంతమేర ఉంది అన్న విషయాలపై కూడా కూలంకశంగా రిపోర్ట్ అందించాలని సూచించారు. దీంతో తెలంగాణలోని గ్రామ స్థాయి నాయకుల నుండి మొదలు మంత్రులు, మాజీలు ఇలా ప్రతి ఒక్కరి గురించి వివరాలు సేకరించే పనిలో నిమగ్నం అయ్యారు ఇంటెలిజెన్స్ అధికారులు.
టీఆర్ఎస్ డీ మెరిట్స్ కూడా…
ఈ ప్రక్రియను ఇక నుంచి నిరంతరం కొనసాగించాల్సిందేనని, ప్రతి అంశాన్ని కూడా ప్రభుత్వం దృష్టికి తీసుకవచ్చి వాస్తవాలు చెప్పాల్సిందేనని సీఎం స్పష్టం చేసినట్టు తెలుస్తోంది. ఇప్పటి వరకు ప్రజల్లో టీఆర్ఎస్‌కు ఉన్న బలాన్ని, ప్రతిపక్ష పార్టీల బలహీనతలను మాత్రమే పరిగణనలోకి తీసుకున్నామని ఇక నుంచి టీఆర్ఎస్ పార్టీ, ప్రభుత్వ వైఫల్యాలపై కూడా ఎప్పటికప్పుడు నివేదికలు పంపించాలని ప్రగతి భవన్ నుంచి ఇంటెలిజెన్స్ వర్గాలకు ఆదేశాలు జారీ అయ్యాయని తెలుస్తోంది. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా నిఘా వర్గాలు ఈ వ్యవహరంపై ప్రత్యేక దృష్టి సారించాయి.
అక్కడెలా..?
ఉప ఎన్నిక జరగాల్సిన నియోజకవర్గంతో పాటు, బల్దియా ఎలక్షన్లు జరగనున్న నగరాలు, పట్టణాలపై కూడా ప్రత్యేకంగా రిపోర్ట్‌లు అందించాలని ఆదేశాలు వచ్చాయి. ఆయా చోట్ల పార్టీ పరిస్థితి ఎలా ఉంది..? అక్కడి ప్రజల నాడి ఎలా ఉంది, వ్యతిరేకతను పార్టీకి అనుకూలంగా మల్చుకోవడానికి చేపట్టాల్సిన చర్యలపై కూడా రిపోర్టులు అందించేందుకు ఇంటెలిజెన్స్ ఉన్నతాధికారులు సమాయత్తం అవుతున్నారు.