వరద నష్టంపై సీఎం జగన్ సమీక్ష..హాజరైన కేంద్ర బృందం

by srinivas |
cm jagan
X

దిశ, ఏపీ బ్యూరో: ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ భారీ వర్షాలు, వరద నష్టం పై సమీక్ష నిర్వహించారు. తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో జిల్లా కలెక్టర్లతో సమీక్ష నిర్వహించారు. ఈ సమీక్షలో కేంద్ర బృందం సైతం పాల్గొన్నారు.

కేంద్ర బృందం సభ్యులు కునాల్‌ సత్యార్ధి, అభయ్‌ కుమార్, డాక్టర్‌ కే.మనోహరన్, శ్రీనివాసు బైరి, శివాని శర్మ, శ్రవణ్‌ కుమార్‌ సింగ్, అనిల్‌కుమార్‌ సింగ్‌లు హాజరయ్యారు. వరద నష్టాన్ని అంచనా వేసేందుకు రాష్ట్రానికి వచ్చిన కేంద్ర బృందాలు నెల్లూరు, చిత్తూరు, అనంతపురం, వైఎస్ఆర్ జిల్లాలో కేంద్ర బృందాలు పర్యటించిన సంగతి తెలిసిందే. అయితే ఈ వరదల ప్రభావంతో ఎంత నష్టం జరిగింది అని నిర్ధారించారు.. ఎలాంటి నష్టం వాటిల్లింది అనే దానిపై సీఎం జగన్ కేంద్ర బృందాన్ని అడిగి తెలుసుకున్నారు.


👉 Read Disha Special stories


Next Story

Most Viewed