అరకులో ప్రపంచస్థాయి హాస్పిటాలిటీ -జగన్ 

by srinivas |
అరకులో ప్రపంచస్థాయి హాస్పిటాలిటీ -జగన్ 
X

దిశ, ఏపీ బ్యూరో: పర్యాటక రంగంలో పెద్ద ఎత్తున పెట్టుబడులను ఆకర్షించడానికి వీలుగా విధివిధానాలు రూపొందించాలని సీఎం వై ఎస్ జగన్ సూచించారు. గురువారం తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో సంబంధిత మంత్రి అవంతి శ్రీనివాస్, ఆ శాఖ అధికారులతో సమీక్షించారు. ఈ సందర్బంగా పర్యాటక రంగంలో పెద్ద ఎత్తున పెట్టుబడులను ఆకర్షించడానికి వీలుగా విధివిధానాలు రూపొందించాలని సీఎం వైఎస్ జగన్ సూచించారు. ఆతిథ్య రంగంలో సుప్రసిద్ధ కంపెనీల భాగస్వామ్యం తీసుకోవాలని చెప్పారు.

రాష్ట్రంలో ఎంపిక చేసిన 12 నుంచి 14 ప్రాంతాలను అభివృద్ధి చేయాలని కోరారు. అరకులో ప్రపంచ స్థాయి మౌలిక సదుపాయాలు కల్పించాలని నిర్దేశించారు. హాస్పిటాలిటీ మేనేజ్‌మెంట్‌లో మంచి కాలేజీలు పెట్టాలని సూచించారు. కాలేజీ నుంచి బయటకు వస్తే తప్పనిసరిగా ఉద్యోగం వస్తుందనే విశ్వాసం కల్పించేలా అమలుచేయాలని చెప్పారు. ఏపిటీడీసీ ప్రాపర్టీస్, లోన్స్‌ విషయంలో ప్రభుత్వ డబ్బు ఎక్కడా దుర్వినియోగం కాకుండా సగం పూర్తయిన ప్రాజెక్ట్‌లు ముందు పూర్తిచేయాలని సీఎం ఆదేశించారు. సమావేశంలో టూరిజం, కల్చర్ స్పెషల్‌ సీఎస్ రజిత్ భార్గవ, ఏపీటీడీసీ ఎండీ ప్రవీణ్‌ కుమార్, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

Advertisement

Next Story

Most Viewed