ఏపీ-అమూల్ ప్రాజెక్టును ప్రారంభించిన జగన్

by srinivas |
ఏపీ-అమూల్ ప్రాజెక్టును ప్రారంభించిన జగన్
X

దిశ, వెబ్‎డెస్క్: ఏపీ-అమూల్ పాల వెల్లువ పైలట్ ప్రాజెక్టును వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సీఎం జగన్ ప్రారంభించారు. ప్రకాశం, చిత్తూరు, కడప జిల్లాలోని 400 గ్రామాల్లో పాలను విక్రయించిన లబ్దిదారులకు నగదు జమ కానుంది. 10 రోజులలోపే రైతుల అకౌంట్‎లో డబ్బులు జమ చేయనున్నారు. లీటర్ పై రూ.5 నుంచి 7 వరకు రైతులకు అదనంగా ప్రయోజనం చేకూరుతోంది.

దీంతో పాటు వైఎస్సార్‌ చేయూత, ఆసరా మహిళలకు పశువుల యూనిట్ల పంపిణీ కార్యక్రమాన్ని సీఎం జగన్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అమూల్‌తో ఒప్పందం ద్వారా పాడిరైతులకు మేలు జరుగుతుందని అన్నారు. పాదయాత్రలో పాడి రైతుల కష్టాలను చూశానని.. అధికారంలోకి వచ్చాక సహకార సొసైటీలను బలోపేతం చేస్తామని హామీ ఇచ్చామని గుర్తుచేశారు. అమూల్‌కు వచ్చే లాభాల్లో ఏడాదికి రెండుసార్లు బోనస్‌ రూపంలో మహిళలకే ఇస్తుందని వెల్లడించారు.

Advertisement

Next Story

Most Viewed