- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఒమిక్రాన్ వ్యాప్తిపై సీఎం జగన్ కీలక ఆదేశాలు
దిశ, ఏపీ బ్యూరో: ‘ఒమిక్రాన్ నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాలి. విమానాశ్రయాల్లో ఆంక్షలు విధించండి. మరో వారం రోజుల్లో జీనోమ్ సీక్వెన్సింగ్ ల్యాబ్ ఏర్పాటు చేయాలి. ఫీవర్ సర్వే కంటిన్యూ చేస్తూనే ఉండాలి అని సీఎం వైఎస్ జగన్ అధికారులను ఆదేశించారు. తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో విలేజ్, అర్బన్ క్లినిక్స్ నిర్మాణం, ప్రభుత్వ ఆసుపత్రుల్లో నాడు– నేడు పనుల ప్రగతిపై సీఎం వైఎస్ జగన్ సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ.. ఒమిక్రాన్ వ్యాప్తి నేపథ్యంలో కఠిన చర్యలు తీసుకోవాలి. మార్గదర్శకాలు, ఆంక్షలు కట్టుదిట్టంగా అమలు చేయాలి. ఎయిర్‌పోర్టుల్లో ఆర్టీపీసీఆర్ పరీక్షలు చేస్తుండాలి. ఒమిక్రాన్ నేపథ్యంలో ఆంక్షలు విధించండి. జనవరి నెలాఖరుకల్లా ప్రతి ఒక్కరికి కరోనా వ్యాక్సిన్ రెండు డోసులు ఇచ్చేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. అయితే ఒమిక్రాన్ వేరియంట్‌ను గుర్తించేందుకు వీలుగా విజయవాడలోనే జీనోమ్ సీక్వెన్సింగ్ ల్యాబ్ ఏర్పాటు చేస్తామని సీఎం జగన్‌కు అధికారులు వివరించారు. వారం రోజుల్లో ల్యాబ్ ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు.