- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
కొత్త జిల్లాల ఏర్పాటుపై సీఎం జగన్ కీలక ఆదేశాలు
దిశ, ఏపీ బ్యూరో: రాష్ట్రంలో జిల్లాల పునర్విభజన ప్రక్రియ ప్రారంభించాలంటూ ఉన్నతాధికారులకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ శనివారం ఆదేశాలిచ్చారు. జనగణన ప్రక్రియ జరుగుతున్న తరుణంలో అది పూర్తయ్యేలోపు జిల్లాల విభజనకు సంబంధించి ప్రాథమిక ప్రక్రియ పూర్తి చేసి నోటిఫికేషన్‌కు సన్నద్ధం కావాలని ఆదేశించారు. శుక్రవారం సాయంత్రం జరిగిన వైసీపీ పార్లమెంటరీ పార్టీ సమావేశంలో ఉన్నతాధికారులకు సీఎం వైఎస్ జగన్ స్పష్టమైన ఉత్తర్వులు ఇచ్చారని తెలుస్తోంది. అయితే జనగణన జరుగుతున్నప్పుడు జిల్లాల విభజన ప్రక్రియను చేపట్టడం సరికాదని అధికారులు సూచించగా.. కనీసం ప్రజాభిప్రాయ సేకరణ అయినా చేపట్టాలని దిశానిర్దేశం చేశారు.
రాష్ట్రంలోని 13 జిల్లాలను 26 జిల్లాలుగా ఏర్పాటు చేయాలని సీఎం నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. పార్లమెంట్ నియోజకవర్గానికి ఒక జిల్లాగా ఏర్పాటు చేస్తామని వైసీపీ గతంలోనే ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే ప్రజల అవసరాల దృష్ట్యా అరకు పార్లమెంటును రెండు జిల్లాలగా ఏర్పాటు చేసే యోచనలో ప్రభుత్వం ఉంది. అయితే ఈ అంశంపై విపక్షాలు భిన్నంగా స్పందిస్తున్నాయి. రాష్ట్రంలో సమస్యలను పక్కదారి పట్టించేందుకే ఈ ఎత్తుగడ వేస్తున్నారని విమర్శిస్తున్నాయి.