- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
తెలంగాణలో ఏపీ ప్రజలున్నారని ఊరుకుంటున్నా.. జగన్ షాకింగ్ కామెంట్స్
దిశ, ఏపీ బ్యూరో : ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల మధ్య నెలకొన్న జలవివాదంపై ఏపీ కేబినెట్ చర్చించింది. రాష్ట్ర హక్కులకు సంబంధించి రాజీ పడేదిలేదని స్పష్టం చేస్తూ సమావేశంలో తీర్మానం చేసింది. అలాగే, శ్రీశైలం జల విద్యుత్ ఉత్పత్తి విషయంలోనూ తెలంగాణ ప్రభుత్వ వైఖరిపై మంత్రివర్గం అసహనం వ్యక్తం చేసింది. తెలంగాణ వ్యవహారాన్ని కేంద్రం దృష్టికి తీసుకెళ్లాలని నిర్ణయించింది. ఈ విషయంపై ప్రధాని మోడీకి లేఖ రాయాలని కేబినెట్ నిర్ణయించింది.
అయితే, కృష్ణా రివర్ మేనేజ్‌మెంట్ బోర్డు ఆదేశాలను పట్టించుకోకుండా, ఆంధ్రప్రదేశ్ అభ్యంతరాలను తోసిపుచ్చుతూ తెలంగాణ ప్రభుత్వం శ్రీశైలం విషయంలో యథేచ్ఛగా నిర్ణయాలు తీసుకుంటుందని మంత్రులు అభిప్రాయపడ్డారు. జలాశయంలో కనీస డ్రాయింగ్ లెవల్‌కు నీటి మట్టం చేరుకోకపోయినప్పటికీ పూర్తి సామర్థ్యంతో జల విద్యుత్ ఉత్పత్తి చేయాలంటూ తెలంగాణ ప్రభుత్వం సోమవారం ఉత్తర్వులు జారీ చేయడంపై అభ్యంతరం వ్యక్తం చేసింది.
తెలంగాణ మంత్రుల వ్యాఖ్యలపై సీఎం జగన్ ఆగ్రహం..
జల వివాదంలో తెలంగాణ మంత్రుల విమర్శలపై సీఎం జగన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణలో ఏపీ ప్రజలున్నారని ఆలోచిస్తున్నానని తెలిపారు. ఏపీ వాళ్లను ఇబ్బంది పెడతారనే ఎక్కువగా మాట్లాడటం లేదన్నారు. ఏపీ రైతులకు అన్యాయం జరుగుతుంటే ఎలా ఊరుకోవాలని ప్రశ్నించారు. తెలంగాణ మంత్రులు చాలా ఎక్కువగా మాట్లాడుతున్నారని అది సరికాదన్నారు. జల వివాదాలపై ఏం చేస్తే బాగుంటుందో ఆలోచన చేయాలే తప్ప విమర్శలు సరికాదని సీఎం జగన్ అభిప్రాయపడ్డారు.