కాల్‌మనీ వ్యవహారాలపై సీఎం జగన్ సీరియస్

by srinivas |
కాల్‌మనీ వ్యవహారాలపై సీఎం జగన్ సీరియస్
X

దిశ, వెబ్‌డెస్క్: ఆన్‌లైన్ కాల్‌మనీ వ్యవహారాలపై ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి సీరియస్ అయ్యారు. మంగళవారం సీఎంఓ కార్యాలయంలో దీనిపై అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆన్‌లైన్‌ కాల్‌మనీ వ్యవహారాలపై దృష్టిపెట్టాలని అధికారులను ఆదేశించారు. యాప్‌ల ద్వారా అధిక వడ్డీలకు రుణాలు ఇచ్చి, ఆ రుణాలు వసూలు చేయడానికి చట్టవ్యతిరేక పనులకు పాల్పడుతున్నారని వారిపై చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. అంతేగాకుండా ఇప్పటికే గుంటూరు, ప్రకాశం జిల్లాల్లో రెండు వేర్వేరు ఘటనల్లో ఆత్మహత్యకు పాల్పడ్డ బాధిత కుటుంబాలకు పరిహారం ప్రకటించారు. గుంటూరు జిల్లా కొర్రపాడులో ఆత్మహత్యచేసుకున్న పదోతరగతి బాలిక సౌమ్య కుటుంబానికి రూ.10లక్షలు, ప్రకాశం జిల్లా ఒంగోలు పట్టణం దశరాజుపల్లెలో మరణించిన దివ్యాంగురాలు, వలంటీర్‌ భువనేశ్వరి కుటుంబానికి రూ. 5 లక్షల ఆర్థిక సహాయం చేయాలని సీఎం అధికారులకు ఆదేశాలు జారీచేశారు.

Advertisement

Next Story

Most Viewed