- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
దసరా ఉత్సవాల్లో ఉద్రిక్తత.. ఇరువర్గాల మధ్య చెలరేగిన ఘర్షణ
దిశ, పరిగి : వికారాబాద్ జిల్లా పరిగి మున్సిపల్ పరిధిలోని 1వ వార్డు మల్లేమోని గూడలో దసరా ఉత్సవాలల్లో రెండు వర్గాల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. ఓ వర్గం వారు శమి పూజ నిర్వహించి జమ్మీ తీసుకొని తీరిగి వస్తుండగా ఓ వర్గం వారు విద్యుత్ సరఫరా నిలిపి వేయించి కర్రలు, రాళ్లతో దాడి చేయడంతో పలువురు యువకులకు తలలు పగిలి రక్త గాయాలు అయినట్లు గ్రామస్తులు తెలిపారు. దాంతో గ్రామంలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. సుమారు రెండు గంటల పాటు రెండు వర్గాల మధ్య వాగ్వివాదం జరిగింది. విషయం తెలుసుకున్న పరిగి డీఏస్పీ శ్రీనివాస్ సంఘటన స్థలానికి చేరుకొని పరిస్థితి సమీక్షించి ఇరు వర్గాలను శాంతిపజేశారు.
డీఏస్పీ తో పాటు పరిగి సిఐ లక్ష్మిరెడ్డి, దోమ ఎస్ఐ రమేష్, ఐదు మంది కానిస్టేబుల్ తో పరిస్థితిని సద్దుమణిగించారు. ఈ ఘర్షణలో చెట్టు కింది ఆనంద్ తల పగిలి రక్త గాయమైంది. గణేష్, అల్లాడి మల్లేష్, తదితరులను కిందపడేసి తొక్కడంతో చేయి విరిగిందని బాధితులు వాపోయారు. వీరితో పాటు మరో వర్గం వారికి కూడా ఇద్దరికి గాయాలయ్యాయి. వినాయక నిమజ్జనం రోజు కూడా ఇలాగే దురుసుగా ప్రవర్తిస్తూ, ఘర్షణ చేసేందుకు ప్రయత్నించారు అంటూ గ్రామస్తులు తెలిపారు. ఇరువురు పరిగి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసేందుకు వచ్చినట్లు తెలిపారు.