సివిల్స్ ర్యాంకర్ వినయ్ కాంత్‌కు ఘన సన్మానం

by Shyam |
సివిల్స్ ర్యాంకర్ వినయ్ కాంత్‌కు ఘన సన్మానం
X

దిశ, సిద్దిపేట: పట్టుదలతో శ్రమిస్తే సాధించలేనిది ఏదీ లేదని సిద్దిపేటకు చెందిన వినయ్ కాంత్ నిరూపించారని జడ్పీ చైర్మన్ వేలేటి రోజా రాధాకృష్ణ శర్మ, ఎమ్మెల్సీ కూర రఘోత్తమరెడ్డి అన్నారు. సివిల్స్ ఫలితాల్లో 516వ ర్యాంకు సాధించిన వినయ్ కాంత్‌ను వారు ఘనంగా సన్మానించారు. ప్రతి విద్యార్థి వినయ్ కాంత్‌ను ఆదర్శంగా తీసుకొని జీవితంలో అత్యుత్తమ స్థాయికి ఎదగాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో స్కూల్ హెడ్ మాస్టర్, ట్రెస్మా జిల్లా అధ్యక్షుడు సుభాష్, వినయ్ కాంత్ తండ్రి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Next Story