- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
బేగంపేటలో పౌర విమానాయాన పరిశోధన కేంద్రం
దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్రంలో పౌర విమానయాన పరిశోధన కేంద్రాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు పార్లమెంట్‌లో పౌరవిమానయాన శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియా ప్రకటించారు. హైదరాబాద్ లోని బేగంపేట విమానాశ్రయంలో దీనిని ఏర్పాటు చేయనున్నట్లు ఆయన తెలిపారు. దీనిని ఎయిర్ పోర్టు అథారిటీ ఆఫ్ ఇండియా రూ.402.13 కోట్ల వ్యయంతో 2023 చివరి నాటికి సిద్ధం చేయనున్నట్లు సింధియా చెప్పారు. ఈ ప్రాజెక్టు ద్వారా పరిశోధన, విమానయాన అభివృద్ధి, ఎయిర్ నావిగేషన్ సర్వీసెస్, ఎయిర్ ట్రాఫికింగ్ మేనేజ్మెంట్ కమ్యూనికేషన్స్ డొమైన్ ఎమ్యులేషన్ , నెట్‌వర్క్ ఎమ్యులేటర్, అనాలసిస్ ల్యాబ్స్ ఏర్పాటవుతాయని సింధియా తెలిపారు. అంతేకాకుండా ప్రమాద విశ్లేషణ కేంద్రం, సైబర్ సెక్యురిటీ ల్యాబ్, డేటా మేనేజ్మెంట్ , ప్రాజెక్ట్ సపోర్ట్, సాఫ్ట్‌వేర్ సొల్యూషన్ సెంటర్ లను ఈ కేంద్రం కలిగి ఉంటుందని కేంద్ర మంత్రి తెలిపారు.