అందుకోసమే ఆ అప్లికేషన్

by Shyam |
అందుకోసమే ఆ అప్లికేషన్
X

దిశ, మెదక్: కరోనా వైరస్ వ్యాప్తిని నివారణ కోసం దేశవ్యాప్తంగా లాక్‌డౌన్ అమలు చేస్తుంది . అయినప్పటికీ కొంత మంది వ్యక్తులు అవసరం లేకున్నా రోడ్లపై తిరుగుతున్నారు. ఇటువంటి వారిని గుర్తించేందుకు తెలంగాణ రాష్ట్ర పోలీసులు ( సిటిజన్ ట్రాకింగ్ యాప్ ఫర్ కొవిడ్-19 ) అనే కొత్త అప్లికేషన్‌ను ప్రారంభించినట్లు సంగారెడ్డి జిల్లా ఎస్పీ చంద్రశేఖర్ రెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అప్లికేషన్‌ను సంగారెడ్డి జిల్లాలోని పోలీస్ అధికారులు తమ సెల్‌ఫోన్‌లల్లో ఇన్‌స్టాల్ చేసుకున్నారని తెలిపారు. ఏదైనా వాహనం చెక్‌పోస్టును దాటే సమయంలో అక్కడ ఉన్న పోలీస్ అధికారులు తమ ఫోన్‌లో ఉన్న సిటిజెన్ ట్రాకింగ్ అప్లికేషనులో ఆ వాహనం నెంబర్, మొబైల్, ఆధార్ కార్డు, డ్రైవింగ్ లైసెన్స్ నెంబర్ వివరాలను నమోదు చేసుకుంటారని చెప్పారు. బయటకు రావడానికి గల కారణం వంటి వివరాలను కూడా అందులో పొందుపర్చవచ్చని స్పష్టం చేశారు. ఆ తర్వాత అదే వాహనం, వ్యక్తి మళ్లీ బయటకు వస్తే చెక్ పోస్ట్ లో ఉన్న పోలీస్ అధికారులు సిటిజెన్ ట్రాకింగ్ అప్లికేషనులో ఆ వాహనం నెంబర్ నమోదు చేయగానే ఇంతకు ముందు ఎన్ని సార్లు బయటకు వచ్చాడు , ఏ కారణంతో బయటకు వచ్చాడు అనే వివరాలు సులువుగా తెలుసుకోవచ్చు అని ఎస్పీ అప్లికేషన్‌ గురించి వివరణ ఇచ్చారు.

Tags: Citizen Tracking App for Kovid-19, sp chandrashekar, commnents, sangareddy

Advertisement

Next Story