ఖమ్మంలో సిటిజన్ ట్రాకింగ్ యాప్

by  |
ఖమ్మంలో సిటిజన్ ట్రాకింగ్ యాప్
X

దిశ‌, ఖ‌మ్మం: ప‌నిలేకున్నా ఆక‌తాయిగా తిరుగుతున్న వాహ‌న‌దారుల‌ను ప‌ట్టేసేందుకు ‘‘సిటిజన్‌ ట్రాకింగ్‌ యాప్‌ ఫర్‌ కోవిడ్‌ 19’’ అనే కొత్త అప్లికేషన్‌ను జిల్లాలో ప్రారంభించినట్లు ఖమ్మం పోలీస్ కమిషనర్ తఫ్సీర్ ఇక్బాల్ తెలిపారు. జిల్లాలో పాజిటివ్ కేసులు నాలుగుకు చేరుకోవడంతో వైరస్ వ్యాప్తిని నియంత్రించేందుకు పోలీస్ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. జిల్లాలో కరోనా పాజిటివ్ కేసులు నాలుగుకు చేరడంతో ముందస్తు చర్యల్లో భాగంగా జిల్లాలో లాక్ డౌన్ నిబంధనలు మరింత కఠినంగా అమలు చేయాలని పోలీస్ అధికారులను ఆదేశించారు. నిర్దేశించిన సమయంలోనే అత్యవసర సరుకులను ఇంటికి తీసుకెళ్లాల‌ని ప్ర‌జ‌ల‌కు సూచించారు. అది కూడా ఒక్క‌రికే ప‌ర్మిష‌న్ ఉంటుంద‌ని తెలిపారు. అన‌వ‌స‌రంగా రోడ్ల‌పైకి వ‌చ్చే వాహ‌నాల‌ను సీజ్ చేసి లాక్ డౌన్ ముగిసిన తరువాతనే రిలీజ్ చేయాలన్నారు. లాక్‌డౌన్‌ నిబంధనలను పట్టించుకోకుండా బయటికి వస్తున్న పౌరుల ఆధార్ కార్డ్, ఫోన్ నెంబ‌ర్లను సేక‌రించి.. సిటిజన్ ట్రాకింగ్ యాప్‌లో పొందుపరచాల‌ని సూచించారు. జీపీఎస్‌ ద్వారా పనిచేసే ఈ యాప్‌లో సదరు వాహనదారుడు మూడు కిలోమీట‌ర్ల‌ పరిమితి దాటి ప్రయాణం చేస్తే.. ఆ సమాచారం కంట్రోల్ రూంలోని సిబ్బంది గుర్తిస్తార‌ని చెప్పారు. దీంతో వెంటనే అతని వాహనాన్ని స్వాధీనం చేసుకుని, సదరు వ్యక్తిపై కేసులు నమోదు చేయాలని అన్నారు.

Tags: CP Tafseer Iqbal, comments, Citizen Tracking App for Covid 19, khammam

Advertisement

Next Story

Most Viewed