- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఏకే 47తో కాల్చుకుని జవాను ఆత్మహత్యాయత్నం
దిశ, వెబ్‌డెస్క్ : విధుల్లో ఉన్న ఓ జవాన్ ఆత్మహత్యాయత్నం చేశాడు. తమిళనాడులో ఎన్నికల విధులు నిర్వహిస్తున్న సీఐఎస్ఎఫ్ జవాన్ తన వద్ద ఉన్న ఏకే47తో గొంతులో కాల్చుకుని ఈ దుశ్చర్యకు పాల్పడ్డాడు.
సేలంలో ఎన్నికల విధుల నిమిత్తం వంద మంది పారా మిలిటరీ, సీఐఎస్‌ఎఫ్ జవానులు అన్నదాన పట్టిలో బస చేస్తున్నారు. ఈ క్రమంలో సీఐఎస్‌ఎఫ్ జవాన్ ఆశిష్ కుమార్ (30) గది నుంచి తుపాకీ పేలిన శబ్దం వచ్చింది. వెంటనే అక్కడున్న జవాన్లు వెళ్లి చూడగా.. ఆశిష్ కుమార్ ఏకే47తో గొంతులో కాల్చుకుని రక్తపు మడుగులో పడి ఉన్నాడు. జవాన్లు వెంటనే అతడిని ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ఆశిష్ కుమార్ పరిస్థితి విషమంగా ఉన్నది.
అయితే ఆశిష్ కుమార్ ఆత్మహత్యాయత్నానికి కారణాలు స్పష్టంగా తెలియరాలేదు. కుటుంబ సమస్యలా..? లేక పని భారంతో ఆత్మహత్యాయత్నం చేసుకున్నాడా అనేది తెలియాల్సి ఉంది. ప్రస్తుతం ఆశిష్ కుమార్ ఫ్లయింగ్ స్క్వాడ్ విభాగంలో విధులు నిర్వర్తిస్తున్నారు.