Alia Bhatt: అలియా భట్ వేసుకున్న ఆ సింపుల్ డ్రెస్ ధర ఎంతో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే?

by Hamsa |
Alia Bhatt: అలియా భట్ వేసుకున్న ఆ సింపుల్ డ్రెస్ ధర ఎంతో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే?
X

దిశ, సినిమా: బాలీవుడ్ స్టార్ హీరోయిన్ అలియా భట్(Alia Bhatt) అందరికీ సుపరిచితమే. ఈ అమ్మడు ‘స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్’ సినిమాతో హీరోయిన్‌గా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత ఎన్నో హిట్ చిత్రాల్లో నటించి తన నటనతో సినీ సెలబ్రిటీలను కూడా మెప్పించింది. అలాగే తెలుగలోనూ టాలీవుడ్ స్టార్ హీరోలు, రామ్ చరణ్, ఎన్టీఆర్ కలిసి నటించిన ‘ఆర్ఆర్ఆర్’ హీరోయిన్‌గా చేసింది. ఈ మూవీ ఆస్కార్ అవార్డ్‌ను కూడా సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. ఆ తర్వాత ‘బ్రహ్మస్త్ర’తో బ్లాక్ బస్టర్ హిట్ సాధించింది. ఈ క్రమంలోనే అలియా, బాలీవుడ్ హీరో రణ్‌బీర్‌ కపూర్‌(Ranbir Kapoor)ను ప్రేమించి పెళ్లి చేసుకుంది.

వీరికి ఓ కూతురు ఉంది. అయితే ఆ పాపకు రహా అనే పేరు పెట్టారు. ఇక కూతురు పుట్టిన తర్వాత అలియా ఏడాది పాటు సినిమాలకు గ్యాప్ ఇచ్చింది. మళ్లీ గత ఏడాది ‘జిగ్రా’తో రీఎంట్రీ ఇచ్చి సూపర్ హిట్‌ను అందుకుంది. కానీ ఆ తర్వాత ఎలాంటి మూవీ ప్రకటించలేదు. ఇక కూతురు, భర్తతో వెకేషన్స్‌కు వెళ్తూ ఎంజాయ్ చేస్తుంది. తాజాగా, అలియా భట్ ఓ సింపుల్ డ్రెస్ వేసుకుని కుటుంబంతో కలిసి వెకేషన్‌కు వెళ్లింది. ఇక ముంబై విమానశ్రయంలో సన్ గ్లాసెస్, వెండి చెవి పోగులు, ఫ్లాట్ చెప్పులతో కనిపించింది.

అయితే ఇందులో ఆమె వైట్ కలర్ పూల కుర్తాలో కనిపించి స్పెషల్ అట్రాక్షన్‌గా నిలిచింది. అయితే ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇక అది చూసిన వారంతా అలియా డ్రెస్ గురించి తెగ వెతికేస్తున్నారు. అయితే ఈ సింపుల్ డ్రెస్ ఖరీతు రూ.8,800 అని తెలుస్తోంది. ఇక ఈ విషయం తెలుసుకున్న వారు కొందరు షాక్ అవుతున్నారు. ఆ డ్రెస్‌కి అన్ని వేలా అని ఆశ్చర్యపోతున్నారు. ప్రస్తుతం అలియా భట్ ఫొటోలు నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి.

Next Story