- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
Betting Apps: సుప్రీత చేసింది.. రైటా రాంగా..?.. ఆమె చేసింది ఎంత వరకు కరెక్ట్..?

దిశ, వెబ్ డెస్క్: ఈ మధ్య కాలంలో తప్పులు చేయడం, ఆ తర్వాత క్షమించండి అని చెప్పడం కొందరికి పరిపాటిగా మారింది. సోషల్ మీడియాలో అయితే ఈ పిచ్చి మరీ ఎక్కువ అయింది. ఎలాంటి వీడియోలు పడితే అలాంటివి పోస్టులు చేయడం, అవి వివాదస్పదంగా మారడంతో అలాంటి తప్పులు ఎవరూ చేయొద్దని ఉచిత సలహాలు ఇవ్వడం వంటివి జరుగుతున్నాయి. అయితే ‘‘వాళ్లు సారీ అని చెబితే అంతా తుడిచేసినట్టేనా..?. వాళ్లు పోస్టు చేసిన వీడియోలు సమాజంపై ఎంత ఎఫెక్ట్ చూపించాయనేది చూడరా..?, దాని వల్ల జరిగిన నష్టాన్ని పట్టించుకోరా..?, తప్పుడు సలహాలు ఇస్తూ చేసిన వీడియోలపై ఎలాంటి యాక్షన్ ఉండదా.?.’’ అనే ప్రశ్నలు సమాజంలో విపరీతంగా వినిపిస్తున్నాయి.
సోషల్ మీడియా వచ్చిన తర్వాత వాక్కు స్వాతంత్య్రానికి హద్దు పద్దు లేకుండా పోయింది. ఏది పడితే అది.. ఎవరికి పడితే వాళ్లకు నచ్చినట్లు వీడియోలు పోస్టు చేయొచ్చు. అశ్లీలతకు, డ్రెస్ సెన్స్‌కు నిబంధన లేదు. ఎవరికి తోచినట్లు వాళ్లు మాట్లాడొచ్చు. తప్పు చేసి సలహాలు, సూచనలు ఉచితంగా ఇవ్వొచ్చు. ఇది ఇప్పుడు సోషల్ మీడియాలో జరుగుతున్న తంతు. ఇలా సినీ సెలబ్రెటీల నుంచి వ్యాపార, రాజకీయ ప్రముఖుల వరకూ చిన్నా, పెద్దా తేడా లేకుండా ప్రతి ఒక్కరూ తమకు నచ్చినట్లు వాళ్లు వీడియోల చేసి ఎక్స్‌తో పాటు ఫేస్ బుక్, ఇస్టాగ్రామ్‌తో పంచుకుంటున్నారు. ఆ తర్వాత వాటిని ఎంతమంది చూశారు. ఎన్ని లైకులు వచ్చాయనేది చూస్తున్నారు తప్ప.. ఆ వీడియోల వల్ల సమాజంలో ఎలాంటి పరిస్థితులు ఎదురవుతున్నాయనేది చూడటంలేదు.
ఈ మధ్య కాలంలో జరిగిన సంఘటనలు చూస్తుంటే వాళ్లను ఏమని అనాలో కూడా తెలియడం లేదు. తెలుగు రాష్ట్రాల్లో ఈ మధ్య బెట్టింగ్ యాప్స్ మోసాలు రోజుకొకటి వెలుగులోకి వస్తున్నాయి. ఈ యాప్స్ ద్వారా అప్పులు తీసుకుని నష్టపోయి పలువురు ఆత్మహత్య చేసుకున్న సంఘటనలు సంచలనంగా మారాయి. అయితే వీటి పట్ల అప్రమత్తంగా ఉండాలని చెప్పాల్సింది బోయి కొందరు సెలబ్రిటీలు, యూట్యూబర్లు ప్రమోట్ చేస్తున్నారు. సమాజానికి మంచి చెప్పాల్సింది పోయి ప్రజలను తప్పు దొవపట్టించే వీడియోలు చేసి సోషల్ మీడియాలో ఫ్లాట్ ఫామ్స్‌లో పోస్టులు చేస్తున్నారు. అవి వివాదస్పదంగా మారడంతో సారీ చెబుతున్నారు. ఈ కోవలోనే సినీ నటి సురేఖ వాణి కూతురు సుప్రీత కూడా నడుచుకున్నారు. ఓ బెట్టింగ్ యాప్‌ను ప్రమోటు చేస్తూ వీడియో చేసి జనాలపైకి విడిచిపెట్టారు. ఇది చూసిన నెటజన్లు, ప్రముఖులు, ప్రజలను సుప్రీతకు వ్యతిరేకంగా కామెంట్స్ పెట్టారు. దీంతో ఆమె వెనక్కి తగ్గారు. తెలియక చేశానని, తమను క్షమించాలని సోషల్ మీడియా వేదికగా మరో వీడియోను పోస్టు చేశారు. అలాగే బెట్టింగ్ యాప్స్‌ను ఎవరూ ప్రమోట్ చేయొద్దని కోరారు.
అయితే సుప్రీత చేసిన వీడియా విషయంలో ప్రతి ఒక్కరూ ఆలోచించాల్సిన అవసరం ఉందని పలువురు అంటున్నారు. ఆమె పోస్టు చేసిన వీడియో ఎంత తప్పు ఎంత ఉందనేది చూడాలని అంటున్నారు. ఇటీవల విశాఖకు చెందిన ఓ యూట్యూబర్ బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేసి జైలు పాలైన విషయాన్ని గుర్తు చేస్తున్నారు. యూట్యాబర్ విషయంలో అంత జరిగినా సుప్రిత మళ్లీ అలానే చేయడం ఎంత వరకూ కరెక్ట్ అనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి. అంతేకాదు సుప్రీతతో పాటు పోలీసులపైనా విమర్శలు కురిపిస్తున్నారు. యూట్యూబర్‌పై చర్యలు తీసుకున్నప్పుడు సుప్రితను ఎందుకు వదిలేశారని ప్రశ్నిస్తున్నారు. సుప్రీత చేసింది కరెక్ట్ కాదని తెలిసినప్పుడు ఎందుకు చర్యలు తీసుకోవడంలేదని అంటున్నారు. యూట్యూబర్‌కో న్యాయం.. ఈమెకో న్యాయమా అంటూ నిలదీస్తున్నారు. సుప్రిత ఆడపిల్లైన మాత్రనా చర్యలు తీసుకోకుండా వదిలేస్తారా ..?, కనీసం కౌన్సిలింగ్ కూడా ఇవ్వారా అంటూ కామెంట్స్ పెడుతున్నారు. బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేయడం తప్పు అని, సుప్రీతపై యాక్షన్ తీసుకోకపోవడం ఎంత కరెక్ట్ అని నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. మరి ఇప్పటికైనా ఆమెపై చర్యలు తీసుకుంటారా , లేదా అనేది చూడాల్సి ఉంది.
Read More..
Betting Apps: సారీ.. తెలియక ప్రమోట్ చేశాను! కూతురు సుప్రీత.. సురేఖావాణి రియాక్షన్
Sajjanar: వాళ్లకు డబ్బే సర్వస్వం.. ఇలాంటి వాళ్లనా మీరు ఫాలో అవుతుంది: సజ్జనార్