- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
‘ఆరెంజ్’ మూవీ చూస్తూ థియేటర్‌లో ప్రపోజ్.. అక్కడ ఉన్నవారు ఏం చేశారంటే?

దిశ,వెబ్‌డెస్క్: ప్రేమికుల రోజు(Valentine's Day) సందర్భంగా గ్లోబల్ స్టార్ రామ్ చరణ్(Ram Charan) నటించిన రొమాంటిక్ మూవీ 'ఆరెంజ్'(Orange) రీ రిలీజైన విషయం తెలిసిందే. ఇవాళ(శుక్రవారం) ఈ మూవీ థియేటర్ల(Theatres)లో సందడి చేస్తోంది. 'బొమ్మరిల్లు' భాస్కర్(Bhaskar) దర్శకత్వంలో హీరో రామ్ చరణ్, హీరోయిన్ జెనీలియా(Genelia) కాంబినేషన్‌లో 'ఆరెంజ్' మూవీ తెరకెక్కింది. అయితే భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ సినిమా ప్రేక్షకులను పెద్దగా ఆకట్టుకోలేకపోయింది. కానీ.. ఈ మూవీ అప్పటి యూత్, మెగా ఫ్యాన్స్‌కి మాత్రం ప్రత్యేకమనే చెప్పాలి.
ఈ క్రమంలో వాలెంటైన్స్ డే సందర్భంగా రీరిలీజైన ఆరెంజ్ మూవీ(Orange Movie) చూడటానికి యువత వెళ్లారు. ఈ క్రమంలో ఓ థియేటర్లో ఆసక్తికరమైన ఘటన చోటుచేసుకుంది. బెంగళూరు(Bangalore)లోని థియేటర్‌లో ఓ వ్యక్తి ప్రేక్షకుల సమక్షంలో తన ప్రేయసి ముందు మోకరిల్లి తన ప్రేయసికి రింగ్‌తో ప్రపోజ్(Propose) చేశాడు. అది చూసి అక్కడనున్నవారంతా అతనికి సపోర్ట్‌గా కేకలు పెడుతూ.. పేపర్లు చల్లుతూ సెలబ్రేట్ చేశారు. దీనికి సంబందించిన వీడియో ప్రజెంట్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ మూవీ 2023లో రీ రిలీజ్ అవ్వగా మంచి స్పందన వచ్చింది.