- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
Adah Sharma : వాట్ ఎ లవ్లీ సర్‌ప్రైజ్ అంటూ యంగ్ హీరోయిన్ పోస్ట్.. ఆకట్టుకుంటున్న ఫొటోస్

దిశ, సినిమా: ‘హార్ట్ ఎటాక్’ (Heart attack) సినిమాతో తెలుగు ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన అదా శర్మ (Adah Sharma).. అనతి కాలంలోనే మంచి గుర్తింపు తెచ్చుకుంది. దీంతో భాషతో సంబంధం లేకుండా హిందీ, కన్నడ, తమిళంలో వరుస సినిమాలు చేస్తూ సందడి చేస్తుంది. అంతే కాకుండా ‘కేరళ స్టోరీ’ (The Kerala Story), ‘బస్తర్: ది నక్సల్ స్టోరీ’ (Bastar: The Naxal Story) సినిమాలతో మాత్రం పాన్ ఇండియా రేంజ్‌లో క్రేజ్ తెచ్చుకుంది. ఇక గతేడాది ‘CD’ అనే చిత్రంతో తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చి అలరించింది. ఆ తర్వాత ఏ ఇతర భాషల్లో మరో సినిమా అనౌన్స్ చేయలేదు. కానీ నిత్యం సోషల్ మీడియా (Social media)లో యాక్టీవ్‌గా ఉంటూ.. తన అందచందాలతో ఫ్యాన్స్‌ను ఆకట్టుకుంటోంది. ప్రోషినల్‌తో పాటు పర్సనల్ ఇష్యూస్ కూడా అభిమానులతో పంచుకుంటూ ఉంటోంది.
ఈ క్రమంలోనే తాజాగా ఈ అమ్మడు ఓ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరయ్యింది. అక్కడ విదేశీయులు (Foreigners) అదా శర్మకు సర్‌ప్రైజ్ ఇచ్చారంటూ తన X వేదికగా ఓ పోస్ట్ పెట్టింది. ఈ పోస్ట్‌లో ‘వాట్ ఎ లవ్లీ సర్‌ప్రైజ్..!! నాకు చెప్పుంటే నేను కూడా సాది వేసుకుని ఈ కార్యక్రమానికి వచ్చేదాన్ని! ఈ ఈవెంట్‌కి కేరళ స్టోరీ హీరోయిన్ వస్తున్నందున ఈ అమ్మాయిలు (విదేశీయులు) చీర కట్టుకుని సర్‌ప్రైజ్ చేశారు. వాళ్లు ఇదే మొదటిసారి చీర కట్టడం. స్టన్నింగ్‌గా కనిపిస్తున్నారు కదూ!!!!’ అంటూ చెప్పుకొచ్చింది. ప్రజెంట్ ఈ పోస్ట్ వైరల్ అవుతుండగా.. విదేశీయ అమ్మాయిలు నిజంగా క్యూట్‌గా ఉన్నారంటూ కామెంట్స్ చేస్తు్న్నారు నెటిజన్లు.