- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
Vishwaksen: మా సినిమాకి 'A' సర్టిఫికెట్ ఎందుకిచ్చారో మూవీ చూశాక మీకే తెలుస్తుంది.. 'లైలా' పై విశ్వక్ కామెంట్స్

దిశ, వెబ్ డెస్క్ : మాస్ కాదాస్ విశ్వక్ సేన్ (Vishwaksen ) హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ 'లైలా' ( Laila ) వాలెంటైన్స్ డే సందర్భంగా ఫిబ్రవరి 14 న ఆడియెన్స్ కు ముందుకు రానుంది. ఈ చిత్రం కోసం ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. దీనిలో విశ్వక్ లేడీ గెటప్ లో కనిపించడం సినిమా పై అంచనాలు పెరిగాయి. రామ్ నారాయణ్ డైరెక్షన్ చేసిన ఈ చిత్రాన్ని షైన్ స్క్రీన్స్ పతాకం మీద పై సాహు గారపాటి నిర్మించారు.
అయితే, గ్యాప్ లేకుండా చిత్ర బృందం ప్రమోషన్స్ చేస్తున్నారు. ఇటీవలే ఓ ఇంటర్వ్యూలో హీరో విశ్వక్ లైలా మూవీకి సంబంధించి ఇంట్రెస్టింగ్ విషయాలను పంచుకున్నారు. 'లైలా' సినిమాకి సెన్సార్ బోర్డు 'ఎ' సర్టిఫికేట్ ఇచ్చినట్లు విశ్వక్ చెప్పాడు. మా సినిమాకి 'A' సెర్టిఫికెట్ ఎందుకు వచ్చిందో రిలీజ్ అయ్యాక ఆడియెన్స్ కు తెలుస్తుందన్నారు.
ఇది యూత్ ని ఆకట్టుకునే విధంగా ఉండబోతున్నట్లు తెలిపారు. ఇప్పటికే 'లైలా' మూవీ నుంచి విడుదలైన ట్రైలర్, సాంగ్స్ సినిమాకు సూపర్ బజ్ క్రియేట్ చేశాయి. ముఖ్యంగా ' ఓహో రత్తమ్మా' పాట సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతోంది. మొన్నటి వరకు ట్రెండ్ అయిన 'కోయ్ కోయ్ కోడ్ని కోయ్' అనే లిరిక్ ని ఈ సాంగ్ మధ్యలో యాడ్ చేయడం వలన హైలైట్ గా నిలిచింది. లియో జేమ్స్ ఈ సినిమాకి సంగీతం అందించారు. 'లైలా' ప్రీ రిలీజ్ ఈవెంట్ కి మెగాస్టార్ చిరంజీవి ముఖ్య అతిధిగా హాజరవ్వనున్నారు. ఈ విషయాన్ని మేకర్స్ ట్విట్టర్ వేదికగా ట్వీట్ చేసి తెలియజేశారు.