- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
విష్ణు విశాల్- మమిత బైజు నటిస్తున్న సినిమా టైటిల్, ఫస్ట్ లుక్ రిలీజ్.. ఈ జంట ఎంత చూడముచ్చటగా ఉందో.. పోస్ట్ వైరల్

దిశ, వెబ్‌డెస్క్: విష్ణు విశాల్(Vishnu Vishal), మమిత బైజు(Mamitha Baiju) జంటగా ఓ సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఇక ఈ చిత్రానికి రామ్ కుమార్(Ram Kumar) దర్శకత్వం వహిస్తున్నారు. అయితే సత్య జ్యోతి ఫిల్మ్స్(Sathya Jyothi Films) పై టీజీ త్యాగరాయన్(TG Thyagarayan) భారీ బడ్జేట్‌తో నిర్మిస్తున్నారు. ఇక రెండు సూపర్ హిట్ సినిమాలైన ‘ముండసుపట్టి’, ‘రాట్‌ససన్’ తర్వాత రామ్‌కుమార్, విష్ణు విశాల్ కాంబినేషన్‌లో వస్తున్న మూడో సినిమా ఇది. దీంతో ఈ మూవీపై భారీ అంచనాలే నెలకొన్నాయి.
ఈ క్రమంలో తాజాగా ఈ మూవీకి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్ ఇచ్చారు మేకర్స్. ఈ మేరకు స్పెషల్ పోస్టర్‌ను రిలీజ్ చేస్తూ.. ఈ సినిమాకు ‘ఇరందు వానం’ అనే టైటిల్ ఫిక్స్ చేశారు. అలాగే ఈ మూవీ నుంచి హీరో, హీరోయిన్ ఫస్ట్ లుక్‌ను రిలీజ్ చేశారు. ప్రస్తుతం ఈ పోస్టర్ సోషల్ మీడియాలో మంచి రెస్పాన్స్ తెచ్చుకుంటుంది. ఇక పోస్టర్‌ను గమనించినట్లయితే.. మేఘాల్లో మమిత బైజు, విశాల్ కూర్చున్నారు. ఒకరిని ఒకరు చూసుకుని నవ్వుకుంటున్నారు. అయితే ఈ పోస్టర్‌ను చూస్తే ప్యూర్ లవ్ స్టోరీ బ్యాక్ గ్రౌండ్‌లో ఈ సినిమా ఉండబోతున్నట్లు తెలుస్తోంది.తం ఈ పోస్ట్ నెట్టింట వైరల్‌గా మారింది.