కింగ్ కోసం ‘కింగ్‌డమ్’ సిద్ధం.. అడవి మనిషిని తలపిస్తోన్న హీరో

by sudharani |   ( Updated:2025-02-13 12:36:06.0  )
కింగ్ కోసం ‘కింగ్‌డమ్’ సిద్ధం.. అడవి మనిషిని తలపిస్తోన్న హీరో
X

దిశ, సినిమా: రౌడీ హీరో విజయ్ దేవరకొండ (Vijay Devarakonda), దర్శకుడు గౌతమ్ తిన్ననూరి (Director Gautham Tinnanuri)కాంబోలో ఓ మూవీ వస్తున్న సంగతి తెలిసిందే.రౌడీ హీరో విజయ్ దేవరకొండ (Vijay Devarakonda), దర్శకుడు గౌతమ్ తిన్ననూరి (Director Gautham Tinnanuri)కాంబోలో ఓ మూవీ వస్తున్న సంగతి తెలిసిందే. 'VD12' అనే వర్కింగ్ టైటిల్‌తో తెరకెక్కుతోన్న ఈ చిత్రం నుంచి ఇప్పటికే పలు అప్‌డేట్స్ రాగా.. తాజాగా టీజర్ రిలీజ్ చేశారు చిత్ర బృందం. యంగ్ టైగర్ ఎన్టీఆర్ (Young Tiger NTR)వాయిస్ ఓవర్‌తో మరింత వైల్డ్‌గా ఆకట్టుకున్న ఈ టీజర్.. అదిరిపోయే యాక్షన్ సన్నివేశాలు, కట్టిపడేసే భావోద్వేగాలు సినిమాపై మరింత రెట్టింపును క్రియేట్ చేస్తున్నాయి. అంతే కాకుండా.. థియేటర్లలో ప్రేక్షకులకు సరికొత్త అనుభూతిని అందించే యాక్షన్ డ్రామాగా ఈ చిత్రం రూపొందుతోందని స్పష్టం అవుతుండగా.. ప్రజెంట్ ఈ టీజర్ సోషల్ మీడియాలో ట్రెండింగ్‌లో నిలిచింది. ఇక దీంతో పాటు మరో అప్‌డేట్ కూడా ఇచ్చారు మేకర్స్.

ఈ సినిమాకు 'కింగ్‌డమ్' (Kingdom)అనే శక్తివంతమైన టైటిల్‌ను ఖరారు చేసినట్లు తాజాగా నిర్మాతలు అధికారికంగా ప్రకటించారు. 'కింగ్‌డమ్' చిత్రానికి విజయ్ దేవరకొండ ప్రాణం పెట్టి పనిచేస్తున్నాడని తెలుస్తోంది. అలాగే 'జెర్సీ' వంటి కల్ట్ క్లాసిక్ తర్వాత గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో ఈ సినిమా రూపుదిద్దుకోవడంతో మూవీపై ప్రేక్షకుల్లో భారీ హైప్ క్రియేట్ అవుతోంది. ఇక 2025, మే 30వ తేదీన ప్రపంచవ్యాప్తంగా భారీస్థాయిలో ఈ మూవీ విడుదలకు సిద్ధం అవుతుండగా.. సినిమాకి సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలో వెల్లడి కానున్నాయని తెలిపారు మేకర్స్.

Next Story