- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
Sankranthiki Vasthunam: " గేమ్ ఛేంజ్ " చేసిన వెంకీ మామ.. దిల్ రాజు ఫుల్ హ్యాపీ.. ఇది ఎవరూ ఉహించలేదుగా!

దిశ, వెబ్ డెస్క్ : ప్రతీ సంక్రాంతికి కుర్ర హీరో దగ్గర నుంచి స్టార్ హీరో సినిమాల వరకు రిలీజ్ అవుతుంటాయి. అయితే, ఈ ఏడాది మెగా , నందమూరి , దగ్గుపాటి ఫ్యామిలీ హీరోలు తలపడగా విక్టరీ వెంకటేశ్ ( Daggubati Venkatesh) బ్లాక్ బస్టర్ కలెక్షన్స్ తో దూసుకెళ్తున్నాడు. ఎలాంటి అంచనాలు లేకుండా అందరి కంటే వెనుక వచ్చి.. కూల్ కూల్ గా పెద్ద హిట్ కొట్టి బ్లాక్ బస్టర్ పొంగల్ సెలబ్రేషన్స్ చేసుకుంటున్నారు.
గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ( Ram Charan) హీరోగా తెరకెక్కిన " గేమ్ ఛేంజర్ " ( Game Changer ) మూవీ జనవరి 10 న థియేటర్లలో రిలీజ్ అయింది. ఈ సినిమా మిక్స్డ్ టాక్ తో రన్ అవుతుంది. ఇదిలా ఉండగా బాలకృష్ట ( Balakrishna) హీరోగా " డాకు మహారాజ్ " ( Daaku Maharaaj ) మూవీ జనవరి 12 న రిలీజ్ అయింది. ఈ సినిమా మొదటి షో నుంచి పాజిటివ్ రెస్పాన్స్ తో దూసుకెళ్తూ కలెక్షన్స్ వసూలు చేస్తుంది. వెంకీ మామ సైలెంట్ గా సంక్రాంతి రోజున " సంక్రాంతికి వస్తున్నాం " ( Sankranthiki Vasthunam) మూవీతో మన ముందుకొచ్చాడు.
వెంకీ సినిమా రిలీజ్ అవ్వని ముందు వరకు హైప్ లేదు కానీ, ఒక్కసారి బొమ్మ థియేటర్లో పడ్డాక ప్రతీ ఒక్కరి నోటి నుంచి మేము సంక్రాంతి మూవీకి వచ్చేసాం అంటూ పోస్ట్లు పెడుతున్నారు. ఇప్పుడు రామ్ చరణ్, బాలయ్య సినిమా వెనక్కి నెట్టి వెంకీ మూవీకి ముందుకొచ్చింది. ఇప్పుడు ఈ మూవీకి ఎక్కువ థియేటర్లు ఇవ్వాలంటూ పబ్లిక్ కూడా డిమాండ్ చేస్తుండటంతో రెండు తెలుగు రాష్ట్రాల్లో 220 ప్లస్ ఎక్సట్రా షోస్ యాడ్ చేశామంటూ చిత్ర యూనిట్ అధికారికంగా ప్రకటించింది. రామ్ చరణ్ గేమ్ ఛేంజ్ చేస్తాడనుకుంటే వెంకీ మామ ఛేంజ్ చేశాడు. ఇది నిజంగా ఎవరూ ఉహించి ఉండరంటూ నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. ఇక మూడు రోజుల్లో ఈ సినిమా బ్రేక్ ఈవెన్ సాధించడంతో దిల్ రాజు కూడా ఫుల్ హ్యాపీగా ఉన్నారు.