- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
దిల్ రాజు నివాసంలో ఐటీ సోదాలు.. స్పందించిన హీరో వెంకటేష్

దిశ,వెబ్‌డెస్క్: టాలీవుడ్ ప్రొడ్యూసర్(Tollywood producer) దిల్ రాజు(Dil Raju) ఇంట్లో గత మూడు రోజులుగా ఐటీ అధికారుల సోదాలు కొనసాగుతున్న విషయం తెలిసిందే. సంక్రాంతికి రిలీజ్ అయిన సినిమాలు మంచి విజయం సాధించగా.. భారీ వసూళ్లను కలెక్ట్ చేశాయి. అయితే ఈ కలెక్షన్లపై ఐటీ అధికారులు దిల్ రాజు నివాసంతో పాటు కుటుంబ సభ్యుల నివాసాల్లోను సోదాలు నిర్వహిస్తున్నారు. గత మూడు రోజులుగా దిల్ రాజు, మైత్రీ మూవీ మేకర్స్, మ్యాంగో మీడియా, ఇతర ప్రోడ్యూసర్లు, డైరెక్టర్ సుకుమార్ నివాసాల్లో ఈ సోదాలు కొనసాగుతున్నాయి. పండుగ సందర్భంగా సంక్రాంతికి వస్తున్నాం సినిమా విడుదలై ఏకంగా 230 కోట్లకు పైగా కలెక్ట్ చేసింది.
ఈ మూవీ భారీ విజయం సాధించడంతో గత నాలుగు రోజులుగా వివిధ ప్రాంతాల్లో సక్సెస్ మీట్లను ఏర్పాటు చేస్తున్నారు. ఈ క్రమంలోనే దిల్ రాజు నివాసంలో ఐటీ రైడ్స్ పై హీరో వెంకటేష్(Hero Venkatesh) స్పందించారు. తాజాగా సంక్రాంతికి వస్తున్నాం మూవీ సక్సెస్ మీట్ లో పాల్గొన్న వెంకటేష్ మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు. దీనిపై విలేకరి అడిగిన ప్రశ్నకు వెంకటేష్ ఆశ్చర్యాన్ని వ్యక్తం చేశారు. కొత్తగా ఈ సమాచారం వింటున్నట్లు ఎక్స్‌ప్రెషన్ ఇచ్చారు. ఈ క్రమంలో దిల్ రాజు నివాసంపై ఐటీ సోదాలు జరుగుతున్నాయనే విషయం నాకు తెలియదని హీరో వెంకటేష్ పేర్కొన్నారు. ఇక రెమ్యూనరేషన్ గురించి విలేకరి అడిగిన ప్రశ్నకు.. మిగతా వాళ్ల విషయాలు తనకు తెలియవని, తాను తీసుకునేది ఫుల్ వైట్ (మనీ) అని తేల్చి చెప్పారు. అందులో కూడా వైట్ లో వైట్ మాత్రమే తీసుకుంటానని తెలిపారు.