- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
VD12: రౌడీ హీరో ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్.. VD12 టీజర్ రిలీజ్‌కు ముహూర్తం ఫిక్స్!

దిశ, సినిమా: రౌడీ హీరో విజయ్ దేవరకొండ (Vijay Devarakonda) ప్రజెంట్ ‘VD12’తో బిజీగా ఉన్నాడు. గౌతమ్ తిన్ననూరి (Gautam Tinnanuri) దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీని సితార ఎంటర్‌టైన్మెంట్స్ బ్యానర్‌పై సూర్య దేవర నాగవంశీ (Surya Devara Nagavamshi) నిర్మిస్తు్న్నారు. ఇందులో భాగ్యశ్రీ బోర్సే (Bhagyashree Borse) హీరోయిన్‌గా నటిస్తుండగా.. ప్రజెంట్ ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. విజయ్ దేవరకొండ కెరీర్‌లోనే అత్యంత భారీ బడ్జెట్‌గా రూపొందుతున్న ఈ చిత్రాన్ని రెండు పార్టులుగా ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేలా ప్లాన్ చేస్తున్నారు మేకర్స్. అంతేకాకుండా కేవలం ప్రకటనలతోనే ఈ సినిమాపై భారీ హైప్ క్రియేట్ చేస్తున్నారు. దీంతో ఈ చిత్రం విజయ్ దేవరకొండకు మంచి కమ్ బ్యాక్ ఇస్తుందని దీమా వ్యక్తం చేస్తున్నారు రౌడీ హీరో ఫ్యాన్స్.
ఇదిలా ఉంటే.. తాజాగా ఈ మూవీ టీజర్ (Teaser)కు సంబంధించిన ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ నెట్టింట చక్కర్లు కొడుతోంది. ‘VD12 టీజర్ రెడీ అయ్యింది.. ఫిబ్రవరి 7న రిలీజ్ చేసే ప్లాన్‌లో ఉన్నారు. టీజర్‌లో రిలీజ్ డేట్ చెప్పబోతున్నారు’ అంటూ ట్విట్టర్‌లో ట్రెండ్ అవుతోంది. కాగా.. ఇప్పటికే ఈ సినిమా ఏప్రిల్ 28న రిలీజ్ చేస్తున్నట్లు మూవీ టీమ్ అనౌన్స్ చేసిన విషయం తెలిసిందే. కానీ, తాజాగా ఈ రిలీజ్ డేట్ వాయిదా పడి మే 30కి పోస్ట్ పోన్ అయినట్లు ఫిలిమ్ వర్గాల నుంచి సమాచారం. అలాగే దీనిపై త్వరలో అఫీషియల్ అనౌన్స్‌మెంట్ రానున్నట్లు తెలుస్తోంది.