- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
Mad Square: ఏసుకోండ్రా మీమ్స్.. చేసుకోండ్రా రీల్స్

దిశ, సినిమా: బ్లాక్ బస్టర్ చిత్రం ‘మ్యాడ్’(Mad)కి సీక్వెల్‌గా రూపొందుతోన్న ‘మ్యాడ్ స్క్వేర్’(Mad Square) కోసం సినీ ప్రియులు ఎంతో ఈగర్‌గా వెయిట్ చేస్తున్నారు. ఇందులో నుంచి ప్పటికే విడుదలైన టీజర్ విశేషంగా ఆకట్టుకొని సినిమాపై అంచనాలను రెట్టింపు చేసింది. అలాగే 'లడ్డు గానీ పెళ్లి', 'స్వాతి రెడ్డి' పాటలు కూడా మారుమోగిపోతున్నాయి. ఇప్పుడు ఇదే జోష్‌లో ‘మ్యాడ్ స్క్వేర్’ నుంచి మూడో పాట 'వచ్చార్రోయ్' విడుదల చేశారు మేకర్స్. మ్యాడ్ గ్యాంగ్‌కి తిరిగి స్వాగతం పలకడానికి సరైన గీతం అన్నట్టుగా 'వచ్చార్రోయ్' ఎంతో ఉత్సాహభరితంగా ఉంది. 'లడ్డు గానీ పెళ్లి', 'స్వాతి రెడ్డి' పాటల బాటలోనే.. 'వచ్చార్రోయ్' కూడా విడుదలైన నిమిషాల్లోనే సోషల్ మీడియా విశేష స్పందన సొంతం చేసుకుంటోంది.
భీమ్స్ సిసిరోలియో తనదైన ప్రత్యేక శైలి సంగీతంతో మరోసారి కట్టిపడేశారు. ‘ఏసుకోండ్రా మీమ్స్, చేసుకోండ్రా రీల్స్, రాసుకోండ్రా హెడ్ లైన్స్.. ఇది మ్యాడ్ కాదు మ్యాడ్ మ్యాక్స్’ వంటి పంక్తులతో అందరూ పాడుకునేలా గీతాన్ని రాశారు. యువత కాలు కదిపేలా ఉన్న ఈ గీతం, విడుదలైన కొద్దిసేపటిలోనే సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. కాగా.. నార్నే నితిన్, సంగీత్ శోభన్, రామ్ నితిన్, ప్రియాంక జవాల్కర్, మురళీధర్ గౌడ్, కె.వి. అనుదీప్ తదితరులు ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఈ సినిమాకు కళ్యాణ్ శంకర్ (Director Kalyan Shankar)దర్శకత్వం వహిస్తున్నాడు. శ్రీకర స్టూడియోస్‌తో కలిసి సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చూన్ ఫోర్ సినిమాస్ పతాకాలపై హారిక సూర్యదేవర, సాయి సౌజన్య నిర్మిస్తున్న ఈ మూవీ భారీ అంచనాల మధ్య 2025, మార్చి 28న 'మ్యాడ్ స్క్వేర్' చిత్రం థియేటర్లలో అడుగు పెట్టనుంది.