Ram Charan: ‘RC16’లో ఉపాసన కామియే రోల్.. పోస్ట్‌తో హింట్ ఇచ్చేసిందంటూ నెటిజన్ల కామెంట్స్

by Hamsa |   ( Updated:2025-03-20 14:35:03.0  )
Ram Charan: ‘RC16’లో ఉపాసన కామియే రోల్.. పోస్ట్‌తో హింట్ ఇచ్చేసిందంటూ నెటిజన్ల కామెంట్స్
X

దిశ, సినిమా: గ్లోబల్ స్టార్ రామ్ చరణ్(Ram Charan)ఇటీవల ‘గేమ్ చేంజర్’ (game changer) సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. అయితే శంకర్ (shanker) దర్శకత్వంలో వచ్చిన ఈ మూవీ భారీ అంచనాల మధ్య వచ్చి డిజాస్టర్‌గా నిలిచింది. ప్రస్తుతం రామ్ చరణ్, బుచ్చిబాబు (buchibabu) కాంబోలో ‘RC16’ మూవీ రాబోతున్న విషయం తెలిసిందే. అయితే ఇందులో బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ (janhvi kapoor) హీరోయిన్‌గా నటిస్తోంది. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన పూజా కార్యక్రమం కూడా పూర్తి అయింది. అయితే ఈ మూవీ షూటింగ్ మొదలైపోయింది. అయితే నిత్యం ఈ సినిమాకు సంబంధించిన ఏదో ఒక ఫొటో సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న విషయం తెలిసిందే.

అయితే రామ్ చరణ్ ఈ మూవీ షూటింగ్ సెట్‌కు తన కూతురు క్లిన్ కారాను కూడా తీసుకెళ్లిన విషయం తెలిసిందే. ఇదిలా ఉంటే.. తాజాగా, రామ్ చరణ్ సతీమణి ఉపాసన (Upasana Konidela) ‘RC16’ మూవీ సెట్‌కు వెళ్లింది. ఈ విషయాన్ని తెలుపుతూ ఇన్‌స్టాగ్రామ్ ద్వారా ఓ పోస్ట్ పెట్టింది. జాన్వీ కపూర్‌కు ఓ స్పెషల్ గిఫ్ట్ ఇచ్చినట్లు తెలుస్తోంది. ఏదో డబ్బాలాంటి పరికరాన్ని ఉపాసన, జాన్వీ కపూర్ పట్టుకుని ఫొటో దిగారు. ఇక ఈ పిక్‌ను ఆమె అత్తమాస్ కిచెన్ ఇన్‌స్టా ద్వారా షేర్ చేస్తూ ‘‘RC16’ సెట్‌లో స్పెషల్ డిష్ చేయబోతున్నాం రెడీగా ఉండండి. ఆర్డర్ చేసుకోండి’’ అనే క్యాప్షన్ జత చేసింది. దీంతో ఈ పోస్ట్ సోషల్ మీడియాలో ఫుల్ వైరల్ అవుతోంది.

ఇక అది చూసిన నెటిజన్లు వదిన ‘RC16’సినిమాలో కామియో రోల్ ఏమైనా చేస్తున్నారా అందుకే సెట్‌కి వెళ్లావా? అని కామెంట్స్ చేస్తున్నారు. మరికొందరు మాత్రం జాన్వీకంటే నువ్వే బాగున్నావ్ వదిన అని ఉపాసన అందాన్ని తెగ పొగిడేస్తున్నారు. ఇక ఈ పోస్ట్ చూసిన వారిలో క్యూరియాసిటీ పెరిగిపోయింది. నిజంగానే కామియో రోల్ చేస్తుందా అనే అనుమానాలు మొదలైపోయాయి. ఉపాసన కామియో రోల్ కనుక చేసినట్లు అయితే ‘RC16’ హిట్ కొట్టడం ఖాయం అంటున్నారు మెగా అభిమానులు. మొత్తానికి మెగా కోడలు ఒక్క పోస్ట్‌తో సోషల్ మీడియాను షేక్ చేసిందనడంలో అతిశయోక్తి లేదు.

Read More..

సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో ఎం.ఎస్ ధోని న్యూ యాడ్.. సినిమా రేంజ్‌లో ఉందంటున్న ఫ్యాన్స్

Advertisement
Next Story

Most Viewed