ఉపాసన- క్లీన్ కారాతో ఆ ప్రదేశానికి షిఫ్ట్ అవుతున్న రామ్ చరణ్.. అసలు కారణం అదేనా?

by Hamsa |   ( Updated:2024-03-11 06:58:01.0  )
ఉపాసన- క్లీన్ కారాతో ఆ ప్రదేశానికి షిఫ్ట్ అవుతున్న రామ్ చరణ్.. అసలు కారణం అదేనా?
X

దిశ, సినిమా: మెగాస్టార్ చిరంజీవి తనయుడు రామ్ చరణ్ అందరికీ సుపరిచితమే. ఆయన మెగా వారసుడిగా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చినప్పటికీ తన నటనతో ఫుల్ క్రేజ్ తెచ్చుకున్నాడు. ముఖ్యంగా ఆర్ఆర్ఆర్ మూవీతో గ్లోబల్ స్టార్ అయిపోయాడు. ఇక రామ్ చరణ్ 2012లో ఉపాసన ప్రేమించి పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. దాదాపు 11 ఏళ్ల తర్వాత గత ఏడాది జూన్ 20న ఆడబిడ్డకు ఉపాసన జన్మనిచ్చింది. ఆ పాపకు క్లీన్ కారా అని నామకరణం చేశారు. అయితే రామ్ చరణ్ ఫ్యామిలీకి ఎంత ప్రాధాన్యత ఇస్తారో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.

మెగా ఫ్యామిలీతో తన కూతురు, భార్యతో పలు పార్టీలు చేసుకుంటూ ఫుల్ ఎంజాయ్ చేస్తుంటాడు. ప్రస్తుతం ఆయన వరుస చిత్రాల్లో నటిస్తూ బిజీగా ఉన్నాడు. అయినప్పటికీ షూటింగ్ గ్యాప్ దొరికితే చాలు కుటుంబంతో కలిసి టైమ్ స్పెండ్ చేస్తుంటాడు. అలాగే చిరంజీవి అంటే ఎంత గౌరవం, ప్రేమ ఉందో పలు సందర్భాల్లో చెప్తూ ఎమోషనల్ అవుతాడు. అంతేకాకుండా ఇప్పటికీ తండ్రి మాటను జవదాటడు. ఏ సినిమా చేసినా మెగాస్టార్‌కు చెప్పే చేస్తాడని టాక్. అయితే రామ్ చరణ్, కూతురు, ఉపాసనతో కలిసి దూరంగా పోతున్నాడని పలు వార్తలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.

అసలు విషయంలోకి వెళితే.. ప్రస్తుతం రామ్ చరణ్, శంకర్ డైరెక్షన్‌లో ‘గేజ్ ఛేంజర్’ సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. ఈ మూవీ షూటింగ్ ఎప్పుడో ప్రారంభమైనప్పటికీ.. పోస్టర్, గ్లింప్స్ తప్ప మరే అప్డేట్ విడుదల కాలేదు. ఈ గేమ్ ఛేంజర్ పొలిటికల్ యాక్షన్ డ్రామాగా రాబోతుంది. అయితే ఈ సినిమా షూటింగ్‌లో మార్చి 15 నుంచి రామ్ చరణ్ జాయిన్ అవుతున్నాడు. ఈ షూట్ వైజాగ్‌లో జరగనుందని సమాచారం. అయితే ఈ షూటింగ్ తొందరగా పూర్తి చేసి మిగతా ప్రాజెక్ట్స్‌పై ఫోకస్ పెట్టాలని చూస్తున్నాడట మెగా వారసుడు. దీంతో కొన్ని రోజులు వైజాగ్‌కు మకాం మార్చనున్నాడట. అంతేకాకుండా కూతురు క్లీన్ కారా, ఉపాసనతో షిఫ్ట్ అవుతున్నట్లు తెలుస్తోంది. షూటింగ్ గ్యాప్ దొరికినప్పుడల్లా ఫ్యామిలీతో ఎంజాయ్ చేసేందుకు ఇలా ప్లాన్ చేసుకుంటున్నాడట. ప్రస్తుతం ఇదే విషయం గురించి నెట్టింట రకరకాల వార్తలు వైరల్ అవుతున్నాయి. ఈ విషయం తెలిసిన మెగా ఫ్యాన్స్ మాత్రం కూతురిని వదిలి ఉండలేక అలా చేస్తున్నాడేమో అందులో తప్పేముందని అంటున్నారు.

Advertisement

Next Story