Upasana: స్క్రోలింగ్ ఆపి బదులుగా ఇలా చేయండంటూ జనాలకు సలహాలిచ్చిన ఉపాసన!

by Anjali |
Upasana: స్క్రోలింగ్ ఆపి బదులుగా ఇలా చేయండంటూ జనాలకు సలహాలిచ్చిన ఉపాసన!
X

దిశ, వెబ్‌డెస్క్: మెగా కోడలు ఉపాసన (upasana) గురించి స్పెషల్‌గా చెప్పాల్సిన అక్కర్లేదు. ఈమె ప్రస్తుతం అపోలో హాస్పిటల్ వైస్ చైర్మన్ (Vice Chairman Apollo Hospital)గా ఉంటూ ఇటు మెగా కోడలిగా బాధ్యతలు స్వీకరిస్తుంది. మరోపక్క ఉపాసన పలు సేవా కార్యక్రమాల్లో పాల్గొంటూ ఉంటుంది. తనవంతు సాయం చేస్తూ మెగా కోడలు గొప్ప మనసు చాటుకుంటుంది. ఇప్పటికే ఉపాసన ఎంతో మందికి సేవలు అందించిన విషయం తెలిసిందే.

ఇక ఉపాసన అండ్ టాలీవుడ్ సీనియర్ ప్రముఖ హీరో మెగాస్టార్ చిరంజీవి (Popular hero Megastar Chiranjeevi) తనయుడు గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ (Global star Ram Charan) ప్రేమించుకున్న విషయం తెలిసిందే. కాగా వీరిద్దరు ఇరుకుంబీకులను ఒప్పించి.. గ్రాండ్ గా వివాహం చేసుకున్నారు. ఏడడుగుల, మూడు మూళ్ల బంధంతో ఒక్కటయ్యారు. ఉపాసన, చరణ్ లైఫ్‌లో సెటిల్ అయ్యాక పిల్లల్ని కనాలని ప్లాన్ చేసుకున్నారు.

అలాగే వీరు పెళ్లైనా పదకొండు సంవత్సరాలకు పండండి ఆడపిల్లకు జన్మనిచ్చారు. మెగా ప్రిన్సెస్ అపోలో హాస్పిటల్‌లో చాలా హెల్తీగా జన్మించింది. ఈ బుజ్జాయికి క్లింకార (Clinkara) అని నామకరణం చేశారు. కానీ ఇప్పటి వరకు మెగా ప్రిన్సెస్ ఫేస్ మాత్రం రివీల్ చేయలేదు. దీంతో మెగా ఫ్యాన్స్ నిరాశగా కామెంట్లు చేస్తుంటారు.

ఒకవేళ క్లింకారతో ఫొటోలు దిగినా.. తన ఫేస్ కవర్ చేస్తూ ఎమోజీలు పెడుతారు. ఇదంతా పక్కన పెడితే.. తాజాగా ఉపాసన తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో మంచి మాటలు రాసుకొచ్చింది. ‘‘స్క్రోలింగ్ ఆపి బదులుగా ఇలా చేయండి. Qపాడ్‌కాస్ట్ వినండి. స్నేహితుడికి కాల్ చేయండి.. అలాగే వారిని మీట్ అవ్వండి.

మీరు రోజు చేయవలసిన పనుల జాబితాను ముందే ప్లాన్ చేసుకోండి. కష్టపడి వర్క్ చేసుకోండి. మీ శరీరాన్ని కదిలించండి. క్రమం తప్పకుండా వాకింగ్ చేయమని, అలాగే ఒక పజిల్‌ను పరిష్కరించడని’’ అంటూ ఉపాసన రాసుకొచ్చింది. ప్రస్తుతం ఉపాసన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీ సోషల్ మీడియాలో వైరల్ అవ్వగా.. మంచి మాటలు చెప్పావంటూ జనాలు కొనియాడుతున్నారు.

Next Story

Most Viewed