- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
Tripti Dimri: ప్రియుడితో అడ్డంగా దొరికిపోయిన యానిమల్ బ్యూటీ.. నడిరోడ్డుపై అలా కనిపించడంతో అంతా షాక్! (వీడియో)

దిశ, సినిమా: బాలీవుడ్ యంగ్ హీరోయిన్ త్రిప్తి డిమ్రి(Tripti Dimri) పలు సినిమాల్లో నటించి ప్రేక్షకులను మెప్పించింది. ఇక పాన్ ఇండియా మూవీ ‘యానిమల్’(Animal)లో జోయా పాత్రలో నటించి ఓవర్ నైట్ స్టార్‌గా మారిపోయింది. రణ్‌బీర్ కపూర్ హీరోగా నటించిన ఈ సినిమా బ్లాక్ బస్టర్ విజయం సాధించడంతో పాటు భారీ కలెక్షన్లు రాబట్టడంతో త్రిప్తి క్రేజ్ మారిపోయింది. అంతేకాకుండా తన గ్లామర్‌తో కుర్రాళ్లకు పిచ్చేక్కించింది. అంతేకాకుండా నేషనల్ క్రష్‌గా మారిపోయింది. యానిమల్ తర్వాత త్రిప్తికి వరుస అవకాశాలు రావడంతో స్టార్ హీరోయిన్ అంత పాపులారిటీ వచ్చేసిందనడంలో అతిశయోక్తి లేదు. గత ఏడాది ఈ అమ్మడు బ్యాడ్ న్యూజ్(Bad news), భుల్ భులయ్యా-3(Bhool Bhoolaiya-3) సినిమాల్లో నటించి మెప్పించింది. ప్రస్తుతం ‘ధడక్-2’(Dhadak-2)తో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.
ఇక త్రిప్తి పర్సనల్ లైఫ్ విషయానికొస్తే.. ఈ అమ్మడు గత కొద్ది రోజుల నుంచి ప్రముఖ వ్యాపారవేత్త సామ్ మర్చంట్‌తో ప్రేమలో ఉన్నట్లు పలు వార్తలు వైరల్ అవుతున్న విషయం తెలిసిందే. ఇటీవల అతని బర్త్ డేకి విషెస్ చెప్పడంతో ఈ పుకార్లకు బలం చేకూరినట్లు అయింది. ఈ క్రమంలో.. తాజాగా, త్రిప్తి తన బాయ్‌ఫ్రెండ్‌తో బైక్‌పై చెట్టాపట్టాలేసుకుని తిరుగుతున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. నడిరోడ్డుపై తన ప్రియుడిని పట్టుకుని మేకప్ లేకుండా మాస్క్ ధరించి ముఖం కనిపించకుండా కవర్ చేసుకుంది. ప్రస్తుతం ఈ వీడియో చూసిన వారంతా షాక్ అవుతున్నారు. త్వరలోనే పెళ్లి కూడా చేసుకుంటారని అంతా చర్చించుకుంటున్నారు. కాగా, సామ్ విషయానికొస్తే.. ఆయనకు గోవాలో లగ్జరీ బీచ్ క్లబ్‌లు, హోటల్లు ఉన్నట్లు సమాచారం.