మార్షల్ ఆర్ట్స్, గుర్రపు స్వారీ సీరియస్‌గా నేర్చుకుంటున్న టాలీవుడ్ యంగ్ హీరో

by sudharani |
మార్షల్ ఆర్ట్స్, గుర్రపు స్వారీ సీరియస్‌గా నేర్చుకుంటున్న టాలీవుడ్ యంగ్ హీరో
X

దిశ, సినిమా: టాలీవుడ్ యంగ్ హీరో నిఖిల్ సిద్దార్థ్(Nikhil Siddharth) ‘కార్తికేయ’ (Kartikeya) చిత్రంతో పాన్ ఇండియా లెవల్‌లో గుర్తింపు తెచ్చుకున్నాడు. తర్వాత దానికి సీక్వెల్‌గా తెరకెక్కిన ‘కార్తికేయ-2’(Kartikeya-2)తో మరింత ప్రేక్షకుల్లో మరింత క్రేజ్ తెచ్చుకున్న ఈ కుర్ర హీరో.. ప్రజెంట్ వరుస సినిమాలు చేస్తూ సందడి చేస్తున్నాడు. ఈ క్రమంలోనే ఇటీవల ‘అప్పుడో ఇప్పుడో ఎప్పుడో’ (Appudo Ippudo Eppudo) సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాగా.. ఇప్పుడు ‘స్వయంభూ’ (Swayambhu) మూవీలో నటిస్తున్నాడు. భరత్ కృష్ణమాచారి(Bharat Krishnamachari) దర్శకత్వంలో తెరకెక్కతున్న ఈ సినిమాలో సంయుక్తా మీనన్ (Samyukta Menon), నభా నటేష్ (Nabha Natesh)హీరోయిన్లుగా నటిస్తున్నారు. రెండు పార్టులుగా రాబోతున్న ఈ చిత్రం ప్రజెంట్ షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. దీంతో ఈ సినిమా కోసం నిఖిల్ తన లుక్ మొత్తం చేంజ్ చేసుకున్నాడు. అలాగే తిండి తిప్పులు మానేసి ఫిట్ నెస్ తెగ కష్టపడుతున్నట్లు తెలుస్తుండగా.. ఈ సినిమ కోసం 45 రోజుల పాటు మార్షల్ ఆర్ట్స్, గుర్రపు స్వారీలతో పాటు తదితర విద్యల్లో కఠినమైన శిక్షణ తీసుకున్నట్టు తెలుస్తోంది. ఈ క్రమంలోనే తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న నిఖిల్ ‘స్వయంభూ’పై ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు.

‘ఈ సినిమా కోసం నా లుక్ మొత్తం చేంజ్ చేసేశాను. దీని కోసం ఎనిమిది నెలలు కఠినమైన ఆహార నియమాలు పాటించాను. మద్యం పూర్తిగా మానేశాను.. రైస్, షుగర్ లేకుండా కేవలం ఫ్రూట్స్, ప్రొటీన్ ఫుడ్ మాత్రమే తీసుకున్నారు. నేచులర్‌గా వీరుడిలా కనిపించడానికి చాలా రోజుల సమయం పట్టినప్పటికీ నేను దాన్ని స్వీకరించాను. మార్షల్ ఆర్ట్స్, గుర్రపు స్వారీ నేర్చుకున్నాను’ అంటూ తదితర విషయాలు చెప్పుకొచ్చాడు.

Next Story