- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
భర్తతో విడాకులు తీసుకున్న టాలీవుడ్ హీరోయిన్.. పెళ్లి ఫొటోలు డిలీట్ చేసి హింట్ ఇచ్చేసిందిగా?

దిశ, సినిమా: సినీ సెలబ్రిటీలు ప్రేమించి పెళ్లి చేసుకున్నప్పటికీ చిన్న చిన్న కారణాలతో విడాకులు తీసుకుని విడిపోతున్న విషయం తెలిసిందే. ఇప్పటికే ఎంతోమంది జంటలు వివాహ బంధానికి స్వస్తి చెప్పి రెండో పెళ్లి కూడా చేసుకున్నారు. అయితే డైవర్స్‌పై కొందరు అధికారికంగా ప్రకటించగా.. మరికొందరు మాత్రం విడాకుల(Divorce) విషయాన్ని అధికారికంగా చెప్పనప్పటికీ హింట్ ఇస్తున్నారు. సోషల్ మీడియాలో పెళ్లి ఫొటోలు(Wedding photos), భర్తతో తీసుకున్న మోమరబుల్ పిక్స్‌ను తొలగించి ఆ తర్వాత విడాకుల ప్రకటనతో షాకిస్తున్నారు.
తాజాగా, ఓ టాలీవుడ్ హీరోయిన్ కూడా తన ఇన్‌స్టాగ్రామ్‌లో భర్త ఫొటోలను డిలీట్ చేయడంతో నెట్టింట చర్చానీయాంశంగా మారింది. ఆమె ఎవరో కాదు కలర్స్ స్వాతి. ‘అష్టాచమ్మా’(Ashta Chamma) చిత్రంతో టాలీవుడ్ ఇండస్ట్రీకి పరిచయం అయి స్వామి రారా, కార్తికేయ(Kartikeya), గోల్కొండ హైస్కూల్ వంటి చిత్రాలతో హిట్ కొట్టిన స్వాతి తమిళ, మలయాళ సినిమాల్లోనూ నటించి మెప్పించింది. ఇక కెరీర్ పీక్స్‌లో ఉండగానే కేరళకు చెందిన వికాస్ వాసు(Vikas Vasu)ను పెళ్లి చేసుకుని ఇండస్ట్రీకి దూరం అయింది.
మళ్లీ 2023లో ‘మంత్ ఆఫ్ మధు’(Month of Madhu) చిత్రంతో ప్రేక్షకులను అలరించింది. ఇక ఈ ప్రమోషన్స్‌లోనూ ఆమె విడాకుల గురించి అడగ్గా సమాధానం చెప్పనంటూ తేల్చి చెప్పేసింది. ఇక ఇప్పుడు ఏకంగా తన భర్తతో కలిసి దిగిన ఫొటోలను డిలీట్ చేసింది. దీంతో విడాకులు తీసుకున్నట్లు హింట్ ఇచ్చిందని నెటిజన్లు పలు రకాలుగా చర్చించుకుంటున్నారు. ఇందులో నిజమెంత అనేది తెలియనప్పటికీ ప్రస్తుతం స్వాతి విడాకులకు సంబంధించిన వార్తలు నెట్టింట సంచలనం సృష్టిస్తున్నాయి.