Karthik Subbaraj: స్టార్ హీరో మూవీ టైటిల్ టీజర్ అప్డేట్.. క్యూరియాసిటీ పెంచుతున్న డైరెక్టర్ ట్వీట్

by Hamsa |   ( Updated:2024-12-24 11:42:09.0  )
Karthik Subbaraj: స్టార్ హీరో మూవీ టైటిల్ టీజర్ అప్డేట్.. క్యూరియాసిటీ పెంచుతున్న డైరెక్టర్ ట్వీట్
X

దిశ, సినిమా: కోలీవుడ్ స్టార్ హీరో సూర్య(Suriya) ఇటీవల ‘కంగువ’(Kanguva) సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. శివ(Shiva) దర్శకత్వంలో వచ్చిన ఈ పీరియాడిక్ యాక్షన్ డ్రామా భారీ అంచనాల మధ్య నవంబర్ 14న థియేటర్స్‌లో విడుదలై పాజిటివ్ టాక్‌ను సొంతం చేసుకుంది. కానీ ఊహించిన విధంగా హిట్ అందుకోలేకపోయింది. ఇదిలా ఉంటే.. ప్రజెంట్ సూర్య వరుస సినిమాలతో ఫుల్ బిజీగా గడుపుతున్నారు. అయితే ఇందులో ఒకటి కార్తీక్ సుబ్బరాజ్(Karthik Subbaraj) దర్శకత్వంలో తెరకెక్కనుంది.

సూర్య-44 వర్కింగ్ టైటిల్‌తో రాబోతున్న ఈ చిత్రాన్ని 2D ఎంటర్‌టైన్‌మెంట్స్, స్టోన్ బెంచ్ ఫిలింమ్స్(Stone Bench Films) బ్యానర్స్‌పై నిర్మిస్తున్నారు. తాజాగా, ఈ సినిమాకు సంబంధించిన అప్డేట్ రాబోతున్నట్లు తెలుపుతూ డైరెక్టర్ ట్వీట్ చేశారు. క్రిస్మస్ కానుకగా డబుల్ ధమాకా రాబోతుంది. సూర్య-44 టైటిల్ టీజర్(Title Teaser) విడుదల కానున్నట్లు ప్రకటించారు. ఇక ఈ పోస్ట్ నెట్టింట వైరల్ కావడంతో అది చూసిన సూర్య అభిమానుల్లో ఏం పేరు పెడతారనే క్యూరియాసిటీ పెరిగిపోయింది.

Advertisement

Next Story