నేను హీరో అనగానే ఆ హీరోయిన్స్ రిజెక్ట్ చేశారు.. లవ్ టుడే హీరో ఎమోషనల్ కామెంట్స్

by Kavitha |
నేను హీరో అనగానే ఆ హీరోయిన్స్ రిజెక్ట్ చేశారు.. లవ్ టుడే హీరో ఎమోషనల్ కామెంట్స్
X

దిశ, సినిమా: తమిళ యంగ్ హీరో ప్రదీప్ రంగనాథన్(Pradeep Ranganathan) గురించి స్పెషల్‌గా చెప్పనక్కర్లేదు. ఆయన ‘లవ్ టుడే’(Love Today) సినిమాతో ఇటు తెలుగు, అటు తమిళ ఇండస్ట్రీలో స్టార్ డమ్ అందుకున్నాడు. ఈ ఒక్క చిత్రంతోనే ఆ హీరో గ్రాఫ్ చేంజ్ అయిపోయింది. దీంతో వరుస ఆఫర్లు క్యూ కడుతున్నాయి. అలా ప్రజెంట్ ప్రదీప్ చేతిలో మూడు సినిమాలకు పైనే ఉన్నాయి. అందులో ‘డ్రాగన్’(Dragon), ‘లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ’(Love Insurance Company) చిత్రాలకు ప్రదీప్ రంగనాథన్ హీరోగా, రచయితగా కూడా పనిచేస్తుండటం విశేషం. కొన్ని నెలలుగా ఈ మూవీ షూటింగ్స్ వేగంగా జరుగుతున్నాయి.

అయితే తాజాగా చెన్నైలో జరిగిన ‘డ్రాగన్’ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో పాల్గొన్న ప్రదీప్ రంగనాథన్ కెరీర్ తొలినాళ్లల్లో సినీరంగంలో తనకు ఎదురైన చేదు అనుభవాలను పంచుకున్నాడు. ప్రదీప్ మాట్లాడుతూ.. “నన్ను చాలా మంది కిందకి లాగాలని ప్రయత్నిస్తున్నారు. నేను చూస్తూనే ఉన్నాను. కానీ నేను పెరుగుతున్న మొక్కను. మొక్క మానవడానికి చాలా కష్టపడుతుంది. నేను కూడా అలాగే సవాల్లు స్వీకరిస్తూ మరింత బలంగా ఎదుగుతాను. నేను హీరోగా నటించిన ఫస్ట్ మూవీ లవ్ టుడే విషయానికి వస్తే.. ఈ సినిమాకు హీరోయిన్ దొరకడం చాలా కష్టమైంది. నేను హీరో అనగానే చాలా మంది హీరోయిన్స్ రిజెక్ట్ చేశారు. నాతో నటించేందుకు చాలా మంది హీరోయిన్స్ ఆలోచించారు. ఏవేవో కారణాలు చెప్పి తప్పించుకున్నారు.

మరికొందరేమో నిజాయితీగా నా పక్కన చేయనని.. పెద్ద స్టార్లతో మాత్రమే నటిస్తామని చెప్పారు. వారి నిజాయితీకి థాంక్స్” అని అన్నారు. అలాగే డ్రాగన్ సినిమా గురించి మాట్లాడుతూ.. ‘ఇప్పుడు నేను నటిస్తోన్న డ్రాగన్ సినిమాలో అనుపమ పరమేశ్వరన్(Anupama Parameswaran) కథానాయికగా నటిస్తుంది. కాలేజీ రోజుల్లో అనుపమ నటించిన ‘ప్రేమమ్’(Premam) సినిమా చూశాను. ఇప్పుడు ఆమెతో కలిసి పని చేసినందుకు సంతోషంగా ఉంది’ అని చెప్పుకొచ్చాడు. కాగా అశ్వత్ మరి ముత్తు(Ashwath Marimuthu) దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా ఫిబ్రవరి 21న విడుదల కానుంది.

Next Story