Celebrity Divorces : ఈ విడాకులు చాలా కాస్ట్లీ.. భార్యలను వదిలించుకోవడానికి భారీగా చెల్లించుకున్న హీరోలు వీరే..!

by Prasanna |   ( Updated:2025-02-08 07:23:16.0  )
Celebrity Divorces : ఈ విడాకులు చాలా కాస్ట్లీ.. భార్యలను వదిలించుకోవడానికి భారీగా చెల్లించుకున్న హీరోలు వీరే..!
X

దిశ, వెబ్ డెస్క్ : సెలబ్రిటీల పెళ్లిళ్లకు ఎంత హడావుడి చేస్తారో మనందరికీ తెలిసిందే. వీరు ప్రేమించి పెళ్లి చేసుకున్నా కొద్దీ రోజులు కూడా కలిసి ఉండలేకపోతున్నారు. చిన్న చిన్న గొడవలను కూడా భూతద్దంలో పెట్టి పెద్దవి చేసుకుంటారు. సాధారణ మనుషుల్లాగా వారు సర్దుకుపోరు. తప్పు ఎవరిదైనా ఒకరైన సర్దుకుపోతే బంధాలు బలపడతాయి. కానీ, అలా కాకుండా ఇద్దరిలో ఎవరు తగ్గకపోతే విడాకులకు దారి తీస్తున్నాయి. ఇక పిల్లలు గురించి పట్టించుకోవడం లేదు. ఒక్కసారి విడిపోవాలని అని నిర్ణయం తీసుకున్నాక ముందు, వెనుక చూడకుండా విడాకులు తీసుకుంటున్నారు. అయితే, సెలబ్రిటీలుగా కోట్లు సంపాదించిన ఈ స్టార్లు తమ మాజీ భార్యలకు డబ్బులు ఇచ్చి డివోర్స్ ఇచ్చారు. మరి, సెలబ్రిటీల జీవితంలో జరిగిన ఖరీదైన విడాకుల గురించి ఇక్కడ తెలుసుకుందాం..

1. ప్రభుదేవా-రమాలత: కొరియోగ్రాఫర్ ప్రభుదేవా ( Prabhu Deva ) తన భార్య రమాలతకు 2011లో డివోర్స్ ఇచ్చారు. ఒకప్పుడు నయనతారతో లవ్ లో ఉండి, ఆమెను పెళ్లి చేసుకోవడానికి మొదటి భార్యకు విడాకులు ఇచ్చారు. భరణం కింద కోట్ల రూపాయల విలువ చేసే ఆస్తులు ముట్ట జేప్పారు.

2 .హృతిక్ రోషన్-సుస్సనే ఖాన్: 2000 లో ప్రేమ వివాహం చేసుకున్న హృతిక్ రోషన్ ( Hrithik Roshan ) -సుస్సనే ఖాన్ 2014లో డివోర్స్ తీసుకున్నారు. హృతిక్ రోషన్ హీరోయిన్స్ తో ఉన్న అక్రమ సంబంధాలను పెట్టుకున్నాడన్న కారణంతో ఆమె విడాకులు కోరింది. ఈ విడాకుల మీద సైన్ పెట్టడానికి రూ. 400 కోట్లు అడిగినట్టు సమాచారం. ప్రస్తుతం, హృతిక్ రోషన్ సింగల్ గానే ఉన్నాడు.

3 .అమీర్ ఖాన్-రీనా దత్ : బాలీవుడ్ స్టార్ హీరో అమీర్ ఖాన్ 1986లో రీనా దత్ నీ లవ్ మ్యారేజ్ చేసుకున్నారు. 2000 లో ఇద్దరికీ మనస్పర్థలు రావడంతో విడిపోయారు. ఆ సమయంలోనే ఆమెకు విడాకుల భరణం కింద రూ. 10 కోట్ల వరకు ఇచ్చినట్టు తెలిసిన సమాచారం.

4. సైఫ్ అలీ ఖాన్-అమృత సింగ్: 1991 లో హీరోయిన్ అమృత సింగ్ ని, సైఫ్ అలీ ఖాన్ ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. వీరికి ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఇక 2004లో మనస్పర్థలు రావడంతో విడాకుల తీసుకున్నారు.

Next Story

Most Viewed