- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
అతన్ని ఆ గెటప్‌లో చూసి వాళ్ల అమ్మా నాన్న షాక్ అయ్యారు.. డైరెక్టర్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్(వీడియో)

దిశ, సినిమా: మాస్ కా దాస్ విశ్వక్ సేన్(Vishwak Sen), రామ్ నారాయణ్(Ram Narayan) కాంబోలో రాబోతున్న లేటెస్ట్ మూవీ ‘లైలా’(Laila) . ఈ సినిమాను షైన్ స్క్రీన్ పిక్చర్స్(Shine Screen Pictures), ఎస్‌ఎమ్‌టీ అర్చన ప్రజెంట్స్(SMT Archana Presents) బ్యానర్స్‌పై నిర్మిస్తున్నారు. అయితే ఇందులో ఆకాంక్ష శర్మ(Akanksha Sharma) హీరోయిన్‌గా నటిస్తుండగా.. ఫిబ్రవరి 14న వాలెంటైన్స్‌డే సందర్భంగా థియేటర్స్‌లో విడుదల కానుంది. అయితే ఈ చిత్రంలో విశ్వక్ సేన్ ఫస్ట్ టైం లేడీ గెటప్‌లో కనిపించబోతున్నాడన్న సంగతి తెలిసిందే. దీంతో ఈ సినిమాపై మరింత క్యూరియాసిటీ నెలకొన్నది.
ఇక ఇప్పటికే రిలీజ్ అయిన ఫస్ట్ లుక్ పోస్టర్స్, స్ట్రయికింగ్ గ్లిమ్స్, సాంగ్స్, ట్రైలర్‌కు అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. ఈ క్రమంలో హీరో విశ్వక్ సేన్‌పై డైరెక్టర్ చేసిన కామెంట్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న రామ్ నారాయణ్ మాట్లాడుతూ.. ‘విశ్వక్ సేన్ షూట్‌లో గెటప్ అంతా అయిపోయిన తర్వాత అతని ఫ్యామిలీ మెంబర్స్‌కి వీడియో కాల్ చేశాడు.
అప్పుడు అతన్ని చూసి ఫస్ట్ తనని గుర్తుపట్టలేదు. ఆ తర్వాత అతను చేసుకోబోయే అమ్మాయి ఏమో అని అలాగే చూస్తుండగా.. సడెన్‌గా డ్యాడీ నేను అని అన్నాడు అప్పుడు వాళ్ల నాన్న హే నువ్వా అని షాక్ అయ్యారు. అతనే కాదు విశ్వక్ ఫ్యామిలీ మొత్తం కూడా లేడీ గెటప్‌లో ఉన్న విశ్వక్‌ను చూసి షాక్ అయ్యారు’ అని చెప్పుకొచ్చాడు డైరెక్టర్. ప్రస్తుతం రామ్ నారాయణ చేసిన కామెంట్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి.