'తండేల్ జాతర'కి చీఫ్ గెస్ట్‌గా అల్లు అర్జున్‌తో పాటు ఆ సెన్సేషనల్ స్టార్ డైరెక్టర్.. హైప్ పెంచుతున్న పోస్ట్

by Kavitha |   ( Updated:2025-02-04 12:28:29.0  )
తండేల్ జాతరకి చీఫ్ గెస్ట్‌గా అల్లు అర్జున్‌తో పాటు ఆ సెన్సేషనల్ స్టార్ డైరెక్టర్.. హైప్ పెంచుతున్న పోస్ట్
X

దిశ, సినిమా: అక్కినేని నాగచైతన్య(Akkineni Naga Chaitanya), నేచురల్ బ్యూటీ సాయి పల్లవి(Sai Pallavi) జంటగా నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘తండేల్’(Thandel). చందు మొండేటి(Chandu Mondeti) దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాని.. అల్లు అరవింద్(allu Aravind) సమర్పణలో గీతా ఆర్ట్స్ బ్యానర్ పై బన్నీ వాసు(Bunny Vasu) నిర్మిస్తున్నారు. కాగా ఈ చిత్రం లవర్స్ డే కానుకగా ఫిబ్రవరి 14న గ్రాండ్‌గా థియేటర్లలో రిలీజ్ కానుంది. ఇక విడుదల తేదీ దగ్గర పడడంతో మూవీ టీమ్ ప్రమోషన్ల జోరు పెంచింది.

ఇందులో భాగంగా శనివారం తాండేల్ జాతర(Thandel Jathara) అనే పేరుతో.. కొత్త ప్రీ రిలీజ్ ఈవెంట్ డేట్‌ను అనౌన్స్ చేసిన సంగతి తెలిసిందే. అయితే దీనికి ముఖ్య అతిథిగా అల్లు అర్జున్(Allu Arjun) రాబోతున్నాడు. ఇక ఇప్పటికే మూవీ టీమ్ బహిరంగా కార్యక్రమానికి అనుమతి పొందగా ఈ ఈవెంట్‌ను అన్నపూర్ణ స్టూడియో(Annapurna Studio)లోని 7 ఎకరాల్లో ఇంటి లోపల ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. కాగా ఈ ఈవెంట్ ఫిబ్రవరి 1న అనగా నేడు జరగాల్సి ఉండగా కొన్ని అనివార్య కారణాల వల్ల ఫిబ్రవరి 2కి పోస్ట్ ఫోన్ చేశారు. ఈ క్రమంలో ఈ సినిమాకు సంబంధించిన ఓ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

నేడు హైదరాబాద్‌లో జరగనున్న ప్రీ రిలీజ్ ఈవెంట్ కార్యక్రమానికి అల్లు అర్జున్‌తో పాటు స్టార్ డైరెక్టర్ సందీప్ రెడ్డి కూడా ఈ వేడుకకు ముఖ్య అతిథిగా రానున్నట్లు మూవీ టీమ్ ప్రకటించింది. ఈ మేరకు ఓ స్పెషల్ పోస్టర్‌ను రిలీజ్ చేస్తూ.. సందీప్ రెడ్డి వంగా తండేల్ జాతర కోసం ఫిబ్రవరి 2కి రాబోతున్నాడు అని రాసుకొచ్చింది. కాగా సంధ్య థియేటర్ ఘటన తర్వాత అల్లు అర్జున్ హాజరు కానున్న ఫస్ట్ ఈవెంట్ ఇదే. అలాగే బన్నీ, సందీప్ రెడ్డిల రాకతో తండేల్ హైప్ పాన్ ఇండియా లెవల్లో ఉండబోతుందని ఇప్పటికే నెటిజన్లు, ఫ్యాన్స్ ఫీలవుతున్నారు.


Click Here Tweet..

Next Story

Most Viewed