Pushpa-3 Title: పుష్ప-3 టైటిల్ లీక్.. ఎగిరిగంతులేస్తోన్న ఐకాన్‌స్టార్ అభిమానులు..?

by Anjali |   ( Updated:2024-12-03 16:27:46.0  )
Pushpa-3 Title: పుష్ప-3 టైటిల్ లీక్.. ఎగిరిగంతులేస్తోన్న ఐకాన్‌స్టార్ అభిమానులు..?
X

దిశ, వెబ్‌డెస్క్: ప్రజెంట్ ఎక్కడ చూసినా పుష్పరాజ్(PushparajPushparaj) హవా నడుస్తోంది. సుకుమార్ దర్శకత్వంలో వస్తోన్న పుష్ప-2 (Pushpa-2) కోసం జనాలు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. పార్ట్-1 బ్లాక్ బస్టర్ హిట్ కొట్టడంతో రెండో భాగంపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. దీంతోపాటుగా పుష్ప-2 నుంచి విడుదలైన పోస్టర్లు(Posters), టీజర్లు(Teasers), గ్లింప్స్(Glimpses), సాంగ్స్(Songs) చూశాక నెటిజన్లలో మరింత క్యూరియాసిటీ నెలకొంది. అలాగే ప్రీరిలీజ్ ఈవెంట్స్‌ కూడా ఘనంగా నిర్వహిస్తున్నారు. నిన్న హైదరాబాదు(Hyderabad)లో ప్రీరిలీజ్ కార్యక్రమం జరిగిన విషయం తెలిసిందే.

ఈ ప్రీరిలీజ్ ఐకాన్‌స్టార్ అల్లు అర్జున్(Iconstar Allu Arjun) అభిమానులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. బన్నీ ఓ అభిమానికి సెల్ఫీ కూడా ఇచ్చాడు. అయితే ఈ సందర్భంగా టాలీవుడ్ ప్రముఖ దర్శకుడు.. అద్భుతమైన స్టోరీలను ప్రజల ముందుకు తీసుకోస్తోన్న సుకుమార్(Sukumar) వ్యాఖ్యానించారు. అల్లు అర్జున్‌తో ఉన్న బాండింగ్‌ను పంచుకున్నారు. పుష్ప-2 గురించి మాట్లాడాక.. బన్నీ ఓకే అంటే పుష్ప-3 కూడా తెరకెక్కించేందుకు సిద్ధమని వెల్లడించారు. ఇకపోతే పార్ట్-త్రీ (Pushpa Part-3) కూడా వస్తుందని ఎప్పటినుంచో నెట్టింట టాక్ వినిపిస్తోన్న విషయం తెలిసిందే.

ఈ వార్తలకు బలం చేకూర్చేలా.. ఈవెంట్‌లో సుకుమార్ పార్ట్-3 గురించి మాట్లాడడం.. అలాగే తాజాగా ఓ ఫొటో లీక్ అవ్వడం ఐకాన్‌స్టార్ ఫ్యాన్స్‌ను కుదురుగా ఉండనివ్వడం లేదు. పుష్ప మూవీకి సౌండ్ ఇంజినీర్‌(Sound Engineer)గా ఆస్కార్ అవార్డు(Oscar Award) సొంతం చేసుకున్న రసూల్(Rasul) తాజాగా తన టీమ్‌తో కలిసి సోషల్ మీడియాలో ఓ ఫొటో పంచుకున్నారు. ఈ పిక్ వెనకాల పుష్ప-3 టైటిల్ ఉండడం విశేషం. ‘పుష్ప-3 ది ర్యాంపేజ్’(Pushpa-3 The Rampage) అని ఉండడంతో సినీ ప్రేక్షకులు ఎగిరిగంతులేస్తున్నారు.

దీన్ని బట్టి చూస్తే.. రెండో భాగం సినిమా లాస్ట్‌లో పుష్ప-3 కు సంబంధించిన హింట్ ఇవ్వబోతున్నారంటూ జనాలు అంచనా వేస్తున్నారు. ఇకపోతే బెర్లిన్ ఫిల్మ్ ఫెస్టివల్(Berlin Film Festival) సందర్భంగా ఐకాన్‌స్టార్ కూడా మూడో భాగం ఉంటుందని అన్నారు. ఈ వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టగా.. పార్ట్-2 విడుదలయ్యాక వెంటనే పుష్ప-3 చిత్రషూటింగ్ జరగనుందని కొంతమంది భావించగా.. మరికొంతమంది బన్నీకి వేరే కమిట్మెంట్లు ఉన్నాయి.. కాగా మూడేళ్ల అనంతరమే రానుందని అంటున్నారు.

Read More...

Pushpa-2: పుష్ప-2 రిలీజ్‌కు లైన్ క్లియర్.. విడుదలను ఆపలేమన్న హైకోర్టు


Advertisement

Next Story

Most Viewed