భక్తి పారవశ్యంలో మునిగి తేలుతున్న కన్నప్ప టీమ్.. నెట్టింట వైరల్ అవుతున్న ఫొటోలు

by Kavitha |
భక్తి పారవశ్యంలో మునిగి తేలుతున్న కన్నప్ప టీమ్.. నెట్టింట వైరల్ అవుతున్న ఫొటోలు
X

దిశ, సినిమా: హీరో విష్ణు మంచు(Vishnu Manchu) డ్రీమ్ ప్రాజెక్ట్‌గా తెరకెక్కుతోన్న సినిమా ‘కన్నప్ప’(Kannappa). ముఖేష్ కుమార్ సింగ్ దర్శకత్వం వహిస్తున్న మూవీని.. అవా ఎంటర్‌టైన్మెంట్స్(Ava Entertainments), 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ బ్యానర్లపై మంచు మోహన్ బాబు(Mohan Babu) నిర్మిస్తున్నారు. ఇక ఎంతో ప్రతిష్టాత్మకంగా రూపొందుతున్న ఈ సినిమాలో మోహన్ లాల్(Mohanlal), అక్షయ్ కుమార్(Akshay Kumar), ప్రభాస్, శరత్ కుమార్ వంటి స్టార్ హీరోలు కీలక పాత్రల్లో నటిస్తున్నారు.

ఇక ఇప్పటికే ఈ చిత్రం నుంచి వచ్చిన అన్ని అప్‌డేట్స్ ఎంతగానో ఆకట్టుకోగా.. రీసెంట్‌గా ఈ చిత్రం నుంచి స్టార్ హీరో అక్షయ్ కుమార్(Akshay Kumar) ముల్లోకాలను ఏలే పరమశివుడి పాత్రల్లో నటిస్తున్నట్లు అధికారికంగా ప్రకటించారు. దీంతో ఈ పోస్టర్ పై కూడా మంచి రెస్పాన్స్ వచ్చింది. కాగా ఈ మూవీ ఏప్రిల్ 25న గ్రాండ్‌గా థియేటర్లలో రిలీజ్‌ కానుంది. ఇక విడుదల సమయం దగ్గర పడటంతో ప్రమోషన్స్‌లో జోరు పెంచారు చిత్ర బృందం.

ప్రతి సోమవారం ఓ పోస్టర్‌ను విడుదల చేస్తూ ప్రేక్షకుల్లో క్యూరియాసిటీనీ పెంచుతున్నారు. ఇదిలా ఉంటే.. కన్నప్ప మూవీ టీమ్ రిలీజ్‌కి ముందు దేశంలోని 12 జ్యోతార్లింగాలను దర్శించుకోనున్నట్లు ఇది వరకే మంచు విష్ణు వెల్లడించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఇప్పటికే పన్నెండు జ్యోతిర్లింగాలో ఒకటైన కేదార్ నాథ్‌‌‌తో పాటు బద్రీనాథ్, రిషికేశ్‌లను కన్నప్ప టీమ్ దర్శించుకుంది.

మోహన్ బాబు, మంచు విష్ణులతో పాటు మూవీ టీమ్ అక్కడ ప్రత్యేక పూజలు నిర్వహించింది. ఈ నేపథ్యంలో తాజాగా సోమనాథ, నాగేశ్వర జ్యోతిర్లింగాలను కన్నప్ప టీమ్‌ సందర్శించింది. మోహన్‌బాబు, విష్ణు, శరత్‌కుమార్‌లతో పాటు పలువురు చిత్ర బృందం సభ్యులు అక్కడ ప్రత్యేక పూజలు నిర్వహించారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. కాగా ఈ సినిమాతో మంచు విష్ణు ఎటువంటి విజయం సాధిస్తాడో చూడాల్సి ఉంది.


Next Story

Most Viewed