యానిమల్‌లో రణబీర్ కపూర్‌ను తీసుకోవడానికి కారణం అదే.. స్టార్ డైరెక్టర్ షాకింగ్ కామెంట్స్

by Kavitha |
యానిమల్‌లో రణబీర్ కపూర్‌ను తీసుకోవడానికి కారణం అదే.. స్టార్ డైరెక్టర్ షాకింగ్ కామెంట్స్
X

దిశ, వెబ్‌డెస్క్: బాలీవుడ్ స్టార్ హీరో రణబీర్ కపూర్(Ranaveer Kapoor), నేషనల్ క్రష్ రష్మిక మందన్న(Rashmika Mandanna) నటించిన ‘యానిమల్’(Animal) సినిమా ఎంతగా హిట్ అయిందో మనందరికీ తెలిసిందే. సెన్సేషనల్ డైరెక్టర్ సందీప్ రెడ్డి(Sandeep Reddy Vanga) తెరకెక్కించిన ఈ చిత్రం కలెక్షన్ల సునామీ సృష్టించింది. ఇక ఈ చిత్రంలో సాంగ్స్ అయితే వేరే లెవెల్ అనే చెప్పాలి. ఈ చిత్రంలో నటించిన త్రిప్తి డిమ్రి(Tripthi Dimri) ఒక్క సాంగ్‌తోనే ఓవర్ నైట్ స్టార్‌గా మారిపోయింది. ఈ క్రమంలో డైరెక్టర్ చేసిన కామెంట్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి.

తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న సందీప్ రెడ్డి వంగా ఈ సినిమాలో రణబీర్ కపూర్‌ను ఎంపిక చేయడం గురించి ఆసక్తికర విషయాలను పంచుకున్నాడు. ఆయన మాట్లాడుతూ.. “యానిమల్ సినిమాకు హీరో సెలక్షన్స్ ముందు రణ్‌బీర్ కపూర్ మునుపటి చిత్రాలను చూసినప్పుడు, అతని దూకుడు, తీవ్రమైన నటన నన్ను చాలా ఆకర్షితుడిని చేశాయి. ప్రేమకథ పాత్రలకు రణబీర్ కపూర్ ఫేమస్, అయితే తన సాధారణ ఇమేజ్ నుంచి పూర్తిగా భిన్నంగా, యానిమల్‌లో తీవ్రమైన నటనను చూపించారు.

అయితే కథ రాయడం ప్రారంభించే ముందు, సినిమా కథాంశాన్ని రణ్‌బీర్ కపూర్‌తో ఆన్‌లైన్‌లో పంచుకున్నాను. అది తనకు నచ్చిన తర్వాతే సినిమా కథ మొత్తం రాశాను. ఈ సినిమా కోసం ప్రతి సన్నివేశాన్ని రాసేటప్పుడు, రణబీర్ కపూర్‌ను దృష్టిలో ఉంచుకుని రాశాను. ఇక బాలీవుడ్‌లో చాలా మంది యానిమల్ చిత్రాన్ని విమర్శించారు కానీ రణబీర్ కపూర్‌ను ప్రశంసించారు అని చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా చేసిన కామెంట్స్ నెట్టింట వైరల్‌గా మారాయి.


Next Story