Thandel: ఆ భాషల్లో రిలీజ్ కాబోతున్న బుజ్జి తల్లి సాంగ్.. పోస్ట్ వైరల్

by Kavitha |
Thandel: ఆ భాషల్లో రిలీజ్ కాబోతున్న బుజ్జి తల్లి సాంగ్.. పోస్ట్ వైరల్
X

దిశ, సినిమా: అక్కినేని నాగ చైతన్య(Naga Chaitanya), చందు మొండేటి(Chandu Mondeti) కాంబోలో తెరకెక్కుతున్న తాజా చిత్రం ‘తండేల్’(Thandel). నేచురల్ బ్యూటీ సాయిపల్లవి(Sai Pallavi) హీరోయిన్‌గా నటిస్తున్న ఈ మూవీని.. అల్లు అరవింద్(Allu Aravind) సమర్పణలో ప్రతిష్టాత్మక గీతా ఆర్ట్స్ బ్యానర్స్ పై బన్నీ వాసు(Bunny Vasu) నిర్మిస్తున్నారు. ఇక దీనికి దేవిశ్రీ ప్రసాద్(Devisri Prasad) మ్యూజిక్ డైరెక్టర్‌గా వ్యవహరిస్తున్నారు. కాగా ఈ చిత్రం గ్రాండ్‌గా ప్రేమికుల రోజు(Valentine's Day) కానుకగా ఫిబ్రవరి 7న థియేటర్లలో రిలీజ్ కానుంది. ఇక ఇప్పటి వరకు ఈ సినిమా నుంచి వచ్చిన ప్రతి అప్డేట్ ఆకట్టుకోగా.. ‘బుజ్జి తల్లి’(Bujji Thalli) సాంగ్ మాత్రం ట్రెండ్ సెట్ చేసిందనే చెప్పాలి. ఇప్పటికీ యూ ట్యూబ్‌(You Tube)లో టాప్ ట్రెండింగ్ సాంగ్‌లో ఒకటిగా ఉంది. ఈ క్రమంలో తాజాగా ఈ సాంగ్ హిందీ(Hindi)లో ‘చంపా కలీ’(Champa Kali)పేరుతో, అలాగే తమిళ్‌లో బుజ్జి కుట్టీ(Bujji Kutty) నేమ్‌తో రిలీజ్ కానున్నట్లు మేకర్స్ ప్రకటించారు. కాగా బుజ్జి తల్లి ఫుల్ సాంగ్ జనవరి 19న రిలీజ్ కానుంది.

Next Story

Most Viewed