మాస్ సినిమాలపై మోజెందుకో ఓపెన్ అయిన Sreeleela !

by Anjali |   ( Updated:2023-06-15 11:10:58.0  )
మాస్ సినిమాలపై మోజెందుకో ఓపెన్ అయిన Sreeleela !
X

దిశ, వెబ్‌డెస్క్: టాలీవుడ్ మోస్ట్ హ్యాపెనింగ్ హీరోయిన్ ‘శ్రీలీల’ ప్రస్తుతం వరుస సినిమాలతో దూసుకెళ్తూ..ఇండస్ట్రీనే షేక్ చేస్తోంది. పైగా అగ్ర హీరోల సరసన నటిస్తూ సీనియర్ హీరోయిన్లకు చెమటలు పట్టిస్తోంది ఈ అందాల భామ. బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన ధమాకా చిత్రంతో ఈ భామ ఎంతో క్రేజ్ సంపాదించుకుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. దీంతో ఎంత మంది స్టార్ హీరోయిన్లు ఉన్నా.. దర్శక, నిర్మాతలు ఈ కుర్ర తారనే ఎంపిక చేసుకుంటున్నారు. అయితే శ్రీలీల చిత్రాలు చూసినప్పటికి ఓ విషయం స్పష్టంగా అర్థమైపోతుంది. ప్రజెంట్‌ లైనప్‌లో అన్నీ స్టార్‌ హీరోలు, మాస్‌ హీరోల సినిమాలు ఉన్నాయి. తాజాగా ఈ హీరోయిన్ ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. ‘‘వరుసగా కమర్షియల్‌ సినిమాలు, మాస్‌ చిత్రాలు ఎందుకు చేస్తున్నారు?’’ అని మీడియా వారు ప్రశ్నించగా.. ‘ఏమో కథ విన్నాక చేయలనిపిస్తుంది. కమర్షియల్‌ సినిమాల్లోని మాస్‌ సన్నివేశాలు ఇంట్రెస్టింగ్‌గా ఉంటాయి. అలాంటి సినిమాలు చూడడమన్నా, చేయడమన్నా చాలా ఇష్టం’’ అంటూ శ్రీలీల చెప్పుకొచ్చారు.

Read more: ‘ఆదిపురుష్’ బెనిఫిట్ షోలకు బ్రేక్..! షాక్‌లో ప్రభాస్ అభిమానులు.

భర్తతో కలిసి మామిడికాయలు తెంపుతూ రొమాన్స్ చేస్తున్న అనసూయ.. చూడలేకపోతున్నామంటూ కామెంట్స్

రామాయణం ఆధారంగా వచ్చిన తెలుగు సూపర్ హిట్ సినిమాలు ఇవే!

Advertisement

Next Story