పెళ్లైన 5 రోజులకే సోనాక్షి ప్రెగ్నెంట్.. హాస్పిటల్‌కు వెళ్లడంతో బయటపడ్డ అసలు నిజాలు?

by Hamsa |
పెళ్లైన 5 రోజులకే సోనాక్షి ప్రెగ్నెంట్.. హాస్పిటల్‌కు వెళ్లడంతో బయటపడ్డ అసలు నిజాలు?
X

దిశ, సినిమా: బాలీవుడ్ స్టార్ హీరోయిన్ సోనాక్షి సిన్హా గత కొద్ది కాలంగా నటుడు జహీర్ ఇక్బాల్‌తో రిలేషన్‌లో ఉన్న సంగతి తెలిసిందే. ఇటీవల పెద్దలను ఒప్పించి ప్రియుడిని 23న రిజిస్టర్ మ్యారేజ్ చేసుకుంది. రిసప్షన్‌ను మాత్రం గ్రాండ్‌గా చేసుకుని ఫుల్ ఎంజాయ్ చేసింది. పెళ్లి ఫొటోలను ఈ అమ్మడు నెట్టింట షేర్ చేయడంతో అవి కాస్త వైరల్ అయ్యాయి. ఇక అప్పటి నుంచి సోనాక్షి సిన్హాకు సంబంధించిన పలు వార్తలు సోషల్ మీడియాను షేక్ చేస్తున్నాయి. ఈ క్రమంలో.. తాజాగా, సోనాక్షి పెళ్లైన ఐదు రోజులకే హాస్పిటల్‌ ముందు కనిపించడంతో ప్రెగ్నెంట్ వార్తలు జోరందుకున్నాయి.

ఈ కొత్త జంట కోకిలాబెన్ హాస్పిటల్‌కు వెళ్లినట్లు తెలుస్తోంది. ఇక ఈ విషయం తెలిసిన నెటిజన్లు పెళ్లైన 5 రోజులకే కొత్త జంట ఎందుకు హాస్పిటల్‌కు వెళ్తారు ప్రెగ్నెంట్ అయి ఉంటుందని పలు రకాలుగా చర్చించుకుంటున్నారు. కానీ అందులో ఎలాంటి నిజం లేదని ఫ్యాన్స్ కొట్టి పారేస్తున్నారు. అందుతున్న సమాచారం ప్రకారం.. సోనాక్షి సిన్హా తండ్రి శతృఘన్ హాస్పిటల్‌లో చేరినట్లు సమాచారం. ముంబైలోని కోకిలాబెన్‌లో ఆయన రోటీన్ చెకప్ కోసమే చేరినట్లు తెలుస్తోంది. అయితే కూతురు పెళ్లైన ఐదు రోజులకే తండ్రి హాస్పిటల్ పాలు కావడంతో ఈ విషయం తెలిసిన సోనాక్షి ఫ్యాన్స్ ఆందోళన చెందుతున్నారు. ఆ సంతోషం పూర్తవక ముందే హాస్పిటల్‌కు వెళ్లారా అని అంటున్నారు.



Next Story