- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
Tandel Movie:‘తండేల్’ మూవీకి బిగ్ షాక్.. ఆర్టీసీ బస్సులో ప్రదర్శన

దిశ,వెబ్‌డెస్క్: యువ సామ్రాట్ అక్కినేని నాగచైతన్య(Akkineni Naga Chaitanya), సాయి పల్లవి(Sai Pallavi) మ్యూజికల్ బ్లాక్ బస్టర్ ‘తండేల్’ మూవీ(Tandel Movie) ఫిబ్రవరి 7న ప్రపంచవ్యాప్తంగా విడుదలైన సంగతి తెలిసిందే. చందూ మొండేటి దర్శకత్వం(Directed by Chandu Mondeti)లో మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ సమర్పణలో గీతాఆర్ట్స్ బ్యానర్‌పై ఫ్యాషనేట్ ప్రొడ్యూసర్ బన్నీవాసు ఈ చిత్రాన్ని ప్రతిష్టాత్మకంగా నిర్మించారు. భారీ అంచనాలతో విడుదలైన ఈ మూవీ అన్ని చోట్ల మంచి టాక్‌తో బ్లాక్ బస్టర్ సక్సెస్‌ని సొంతం చేసుకుంది.
ఇక చైతు అభిమానులు థియేటర్ల(theatres)లో సందడి చేస్తున్నారు. ఇక సినిమా పై ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు. ఈ సినిమా రిలీజ్ అయిన మూడు రోజుల్లోనే రూ.62.37 కోట్ల గ్రాస్ వసూళ్లను సాధించింది. ఇదిలా ఉంటే.. ‘తండేల్’(Tandel) మూవీ రిలీజైన మొదటి రోజే బిగ్ షాక్ తగిలింది. ఈ చిత్రాన్ని కొందరు పైరసీ చేసి ఆన్‌లైన్ లో అప్‌లోడ్ చేశారు. ఇటీవల ఓ లోకల్ ఛానల్ లోనూ ఈ చిత్రాన్ని ప్రదర్శించినట్లు వార్తలు వచ్చాయి. దీనిపై ఇదివరకే ఓ మీడియా సమావేశంలో నిర్మాత బన్నీ వాసు స్పందిస్తూ ఆగ్రహం వ్యక్తం చేసిన విషయం తెలిసిందే.
ఈ మూవీ పాజిటివ్ టాక్‌తో దూసుకుపోతున్న క్రమంలో ఆర్టీసీ బస్సులో తండేల్ మూవీ ప్రదర్శన కలకలం రేపింది. ఈ క్రమంలో మూవీ పైరసీ వెర్షన్‌ను APSRTCకి చెందిన ఓ బస్సులో ప్రదర్శించడంపై నిర్మాత బన్నీ వాసు(Producer Bunny Vasu) స్పందించారు. ‘ఓ మీడియా సంస్థలో వచ్చిన న్యూస్ ద్వారా APSRTCకి చెందిన బస్సులో ‘తండేల్’ పైరసీ వెర్షన్ ను ప్రదర్శించినట్లు తెలిసింది. ఇది చట్టవిరుద్ధం, అన్యాయం. మూవీ కోసం రాత్రింబవళ్లు కష్టపడిన వారిని అవమానించినట్లే అవుతోంది. ఒక చిత్రం ఎంతోమంది దర్శకులు, నిర్మాతలు, ఆర్టిస్టుల కల’ అని బన్నీవాసు ఆవేదన వ్యక్తం చేశారు. ఇలాంటివి చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని APSRTC ఛైర్మన్ కొనకళ్ల నారాయణరావును నిర్మాత కోరారు. ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా చూడాలని నిర్మాత బన్నీ వాసు ట్విట్టర్ వేదికగా విజ్ఞప్తి చేశారు.